ఎవడో టిల్లు స్క్వేర్ ఫ్లాప్ అవుతుందని అన్నాడు.. సిద్దు షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మొదటి నుంచే ఈ మూవీ పై భారీ హైప్స్ నెలకున్నాయి.

దీంతో సినిమా రిలీజ్ అనంతరం కూడా ఆ హైప్స్ ని అందుకోగలిగింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు మరియు నిర్మాత నాగవంశీ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సిద్దు మాట్లాడుతూ..” టిల్లు స్క్వేర్ మూవీ ఫ్లాప్ అవుతుందని చాలామంది కామెంట్స్ చేశారు.

మేము దాన్ని పట్టించుకోలేదు. ఈరోజు థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలాంటి సందడి చేస్తుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు గంటలసేపు స్టాండప్ కామెడీ ఉంటుంది. అంతే కాకుండా చాలామంది ట్విట్టర్లో కూడా రివ్యూస్ ఇస్తున్నారు. నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. అది చాలు మాకు ” అంటూ చెప్పుకొచ్చాడు సిద్దు. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.