పవర్ స్టార్‌కు నేను వీరాభిమానిగా మారడానికి కారణం అదే.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్..

తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ లో ఒకరైన హైపర్ ఆది ప్రస్తుతం జనసేన పార్టీ కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. అయితే హైపర్ ఆది స్వయంగా తాను పవన్ కళ్యాణ్ ఎందుకు వీరాభిమానిగా మారాడు ఇటీవల వివరించాడు. హైపర్ ఆది చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ వెంట మేము కూడా ఉంటామని ఆయన వివరించాడు.

విశాఖలో బోట్లు తగలబడిన టైంలో పవన్ కళ్యాణ్ మత్స్యకారులను ఆదుకున్నారని.. కౌలు రైతులను ఆదుకునే విషయంలో పవన్ కళ్యాణ్ చూపించిన శ్ర‌ద్ధ‌, చొర‌వ‌ నాకు చాలా నచ్చిందని.. అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ నీతి నిజాయితీ ఉన్న ఓ వ్యక్తి కావడంతో పవన్ కళ్యాణ్ ఆయనకు సీటు ఇవ్వడం జరిగిందని హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. అనకాపల్లిలో గడిచిన రెండు రోజుల్లో జనసేన ప్రచారానికి ఊహించిన రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందంటూ వివ‌వ‌రించాడు.

AP Politics: పవన్ కళ్యాణ్‌తో కొణతాల భేటీ.. ఏం చర్చించారంటే..? | Konatala  Ramakrishna meet Pawan Kalyan at his residence in Hyderabad VK

కొణ‌తాల‌ రామకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆది కోరారు. ఇక హైపర్ ఆది చేసిన ఈ ప్రచారం జనసేన పార్టీకి కలిసొస్తుందో.. లేదో.. వేచి చూడాలి. జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. 14 నుంచి 15 స్థానాల్లో కచ్చితంగా విజయం దక్కుతుందని.. జననేతలు ధీమాతో ఉన్నారు. జనసేన రాజకీయాల్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయం అంటూ నెట్టింట కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక రోజు రోజుకు కమెడియన్ గా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటున్న హైపర్ ఆది.. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎటువంటి టీవీ షోలో పాల్గొనన‌ని చెబుతుండడం విశేషం.