లేటెస్ట్ పాన్ ఇండియా మంత్ర ఇదే.. దేవుడి పేరు చెప్తే భారీ క‌లెక్ష‌న్లు పక్కానా..?!

ఓ రీజ‌న‌ల్‌ హీరో పాన్ ఇండియా లెవెల్లో హీరోగా పాపులారిటి దక్కించుకోవాలంటే నేషనల్ వైడ్‌గా ఫ్యాన్ బేస్‌ సంపాదించుకోవాలి. దానికి తగ్గట్టుగా అద్భుతమైన కంటెంట్.. కథతో ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో అద్భుతమైన కంటెంట్.. దేవుడు తోడైతే దాని రిజ‌ల్ట్‌ వేరే లెవెల్ లో ఉంటుందని ఇప్పటికే మనం ఎన్నో ఉదాహరణలు చూసాం. అలాంటి డివైన్ రిసల్ట్ అందుకున్న మొదటి సినిమా టాలీవుడ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2. ఈ సినిమా కృష్ణ తత్వంతో వచ్చి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అప్పటివరకు చిన్న హీరోగా ఉన్న నిఖిల్ ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా మారిపోయాడు.

Amid Record-Breaking Box Office Biz, 'Kantara' Becomes The Highest Rated Indian Film On IMDb

దీంతో చాలామంది స్టార్ డైరెక్టర్ తర్వాత ఎన్నో పాన్ ఇండియా సినిమాలను డివోషనల్ కథలుగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అందులో కొన్ని వర్కౌట్ అయితే మరికొన్ని డిజాస్టర్లుగా నిలిచాయి. అయినప్పటికీ కలెక్షన్లు మాత్రం రికార్డ్ స్థాయిలో సృష్టించాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో దేవుడు పేరు చెప్పుకొని చిన్న హీరోలంతా పెద్ద హీరోలుగా మారిపోతున్నారు. మరోసారి అలాంటి ప్రయోగాన్నే చేస్తున్నాడు నిఖిల్. కార్తికేయ టు ఇచ్చిన సక్సెస్ తో మరోసారి డివోషనల్ కంటెంట్ స్వయంభు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన లెక్క చెక్ చేసుకోనన్నాడు. ఇక కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

కాంతర సినిమాకు ముందు వరకు రిషబ్ శెట్టి అంటే ఎవరో కూడా చాలామందికి తెలియదు. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డివైన్ బ్లాక్ బాస్టర్ గా నిలిచి రూ.400 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. అలాగే పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఓ రీజియన్ దేవుడిగా కాంతర కనిపిస్తాడు. ఆ రోల్‌ అంతా యాక్సెప్ట్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత బ్రహ్మస్త్రం ముందు వరకు రణ్ వీర్ కేవలం స్టార్ కిడ్గా మాత్రమే అందరికీ తెలుసు. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చాడని.. స్టార్ బ్యూటీ అలియాభట్ భర్తగా మాత్రమే సౌత్ ఇండస్ట్రీకి కూడా తెలుసు. కానీ బ్రహ్మాస్త్ర సినిమా తర్వాత అయినా సౌత్ ఇండియా ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఇక ఇటీవల వచ్చిన యానిమల్ మూవీ తో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

Hanu-Man (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ప్రస్తుతం బ్రహ్మాస్త్రకు సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు. దీనితోపాటు మన రామాయణ ఇతిహాసం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బాలీవుడ్ రామాయణ్‌లో హీరోగా నటించనున్నాడు. ఇక ఈ ఏడాది మొదటిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్ మూవీ సౌత్ ఇండియాలోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ.300 కోట్ల గ్రాస్ వ‌సుళ‌ను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రూపొందించి ఉంటే మరిన్ని రికార్డులు బ్రేక్ చేసేది అనడంలో సందేహం లేదు. ఇలా పాన్ ఇండియా లెవెల్ లో డివోషనల్ కంటెంట్ తో వచ్చే సినిమాలన్నీ కలెక్షన్ల పరంగా బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా మంత్రా ఇదే అన్నట్లు సినిమాలు తెరకెక్కుతున్నాయి.