అయ్యయ్యో ..పాపం..పుట్టిన రోజు నాడు పరువు పోగొట్టుకున్న తెలుగు హీరో..!

ఎస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇదే న్యూస్ యమ హాట్ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే.. ఎవరైనా స్టార్ సెలబ్రిటీ పుట్టినరోజు అంటే సోషల్ మీడియాలో కనిపించే హంగామా అంతా ఇంతా కాదు . ఆరోజు ముందు రోజు నుంచే సోషల్ మీడియాలో ఆ హీరో పేరు మారుమ్రోగి పోతూ ఉంటుంది. అంతేకాదు సదరు హీరోకి సంబంధించిన నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ అలాగే ఆ హీరో చేస్తున్న ప్రాజెక్టుకు సంబంధించిన టీజర్స్ ట్రైలర్స్ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాయి .

నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో అదేవిధంగా అల్లు అర్జున్ సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ ఎంత ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . ఈరోజు అఖిల్ అక్కినేని పుట్టినరోజు కూడా .. అయితే సోషల్ మీడియాలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ఎక్కడ ఆ ఊసే లేదు . దానికి కారణం ఆయన ఒక్క సినిమా కూడా హిట్ కొట్టక పోవడమే అంటున్నారు జనాలు .

 

అఖిల్ నటించిన సినిమాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఏజెంట్, మిస్టర్ మజ్ను ,హలో ,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ , అఖిల్ అన్ని డిజాస్టర్ మూవీలే ..మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయిన అదంతా కూడా పూజా హెగ్డే ఖాతాలోనే పడిపోయింది. దీంతో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు జనాలు. అఖిల్ అక్కినేని పుట్టినరోజు అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఈరోజు ఆయన తన 30వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు . కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా ఆ ఊసే లేదు. ఒక హీరో కొడుక్కి ఇంతకంటే అవమానం ఇంకెక్కడ ఉంటుంది అంటూ మరింత వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు..!