నాగచైతన్యతో నటించను అంటూ.. మూడుసార్లు బిగ్ ఆఫర్స్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఈమె.. ఎందుకంటే..?

నాగచైతన్య.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో.. అక్కినేని ఇంటిపేరు చెప్పుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి వచ్చారు. హీరో నాగచైతన్య కెరియర్లో హిట్ కొట్టిన సినిమాలు చాలా తక్కువ . మరీ ముఖ్యంగా ఆయన సొంత టాలెంట్ తో హిట్టు కొట్టిన సినిమాలు ఫింగర్ కౌంటింగ్ చేయొచ్చు అని చెప్పవచ్చు . ప్రజెంట్ చందు మొండేటి దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు . ఈ సినిమాకు తండేల్ అంటూ నామకరణం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది. రెండవ హీరోయిన్గా మరో స్టార్ బ్యూటీని మేకర్స్ అనుకుంటున్నారట .కాగా పెద్ద స్టార్ హీరో కాకపోయినప్పటికీ నాగచైతన్యకి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .

మరీ ముఖ్యంగా పేరుకు ముందు అక్కినేని ట్యాగ్ ఉండటంతో హీరోయిన్స్ కూడా ఈయన పట్ల ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం నాగచైతన్యతో అవకాశాలు వస్తే రిజెక్ట్ చేసిందట . దానికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు నాగచైతన్య సినిమాను ఆమె రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారిపోయింది . ఆమె మరెవరో కాదు రష్మిక మందన్నా..ఎస్ ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .

రష్మిక మందన్నా.. నాగచైతన్యతో నటించే ఛాన్స్ వస్తే మూడుసార్లు ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. మజిలీ సినిమాలో ముందుగా రష్మిక మందన్నాని హీరోయిన్గా అనుకున్నారట . అయితే ఆమె కొన్ని కారణాల చేత ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత నాగచైతన్య నటించిన కస్టడి సినిమాలోనూ హీరోయిన్ గా ముందుగా రష్మికను అనుకున్నారట . కానీ ఆ సినిమాను కూడా రష్మిక కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా రిజెక్ట్ చేసింది. ఫైనల్లీ చందు మొండేడేటి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోను హీరోయిన్ రష్మికను అప్రోచ్ అయ్యారట . కాల్ షీట్స్ బిజీ గా ఉండిన కారణంగా ఆమె ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు స్టార్ హీరో సినిమానీ రిజెక్ట్ చేసి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది రష్మిక మందన్నా..!