మొదట పవన్ కళ్యాణ్ సెట్ చేసిన ఈ ట్రెండ్.. ఇప్పటికీ ఆనవాయితీగా కొనసాగుతుందా.. అదేంటంటే..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రెండ్ సెట్టర్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే గతంలో పవన్ కళ్యాణ్ సెట్ చేసిన ఈ ట్రెండ్ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆనవాయితీగా కొనసాగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ట్రెండ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకునేందుకు ప్రతి నటీనటులు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కోసం ఆ స్టార్ డంను నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అహర్నిశలు శ్రమించి మెగాస్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు చిరంజీవి.

Telugu star Pawan Kalyan makes his debut on Instagram; crosses half a million – India TV

ఆయన తమ్ముడుగా పవర్ స్టార్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి సక్సెస్లో అందుకుంటూ తన నటనతో సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలో పవన్ నటించిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. తనదైన రీతులో మంచి గుర్తింపును తెంచుకుంటూ రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు పవన్. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోను బిజీగా గడుపుతున్న సంగతి తెలిసింది. మొత్తానికి పవర్ స్టార్ అభిమానులను నిరాశ‌ప‌ర‌చ‌కుండా సినిమాలను వదలకుండా న‌టిస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఉస్తాద్‌ భగత్ సింగ్, ఓజీ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు పవన్.

Pawan Kalyan's OG teaser: Hungry Cheetah to take cinemas by storm with action-packed, visually striking sequences | Telugu News - The Indian Express

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకముందు.. సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాక కూడా దాదాపు అన్ని సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఫైట్. తర్వాత ఒక పాట ఉండేది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలో కూడా హీరో ఇంట్రడక్షన్ తర్వాత ఒక పాటైతే పెట్టారు.. కాని ఆ పాట సమాజానికి, ఆడవాళ్లకు, వికలాంగులకు ఇలా అందరిని మోటివేట్ చేస్తూ ఉత్తేజపరిచే విధంగా ఉండేలా ప‌వ‌న్ ప్లాన్ చేపించార‌ట‌. అందులో విజువల్స్ ని కూడా అదే మాదిరిగా తీర్చిదిద్దేలా పవన్ చేశాడు. అప్పటినుంచి కొంతమంది హీరోలు ఇదే రూట్‌ ఫాలో అవుతూ వస్తున్నారు. అలా పవన్ సెట్ చేసిన ట్రెండ్ ఇప్పటికీ చాలామంది స్టార్ హీరోస్ ఫాలో అవుతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.