“ఆ టైంలో బాగా నొప్పి వస్తుంది..అందుకే అలా చేయను”.. యంగ్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఉన్న విషయాలను ఉన్నట్లు మాట్లాడేస్తున్నారు . పచ్చిగా బోల్డ్ గా వివరించడానికి ఇష్టపడుతున్నారు . కొంతమంది ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా యూస్ అయ్యే టిప్స్ కూడా ఇస్తున్నారు. రీసెంట్ గా అదే లిస్టులోకి వచ్చేసింది యంగ్ బ్యూటి. టాలీవుడ్ ఇండస్ట్రీలో షికారు అనే మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన గాయత్రి రెడ్డి పేరు చాలా తక్కువ మందికే తెలుసు . కానీ ఆమె అందాల ఆరబోస్తే మాత్రం కళ్ళు ఆర్పకుండా చూసేస్తారు. గాయత్రి చిన్నప్పటినుంచి మోడల్ .. ఆమె మొదట బిగిల్ సినిమాల్లో ఫుట్బాల్ ప్లేయర్ గా నటించి మెప్పించింది .

ఆ తర్వాత లిస్ట్ అనే సినిమాలో కూడా నటించింది . తర్వాత పలు సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకుంది . ఆ తర్వాత నిశాంత్ అనే సివిల్ ఇంజనీర్ లో పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది . ఆమె తనకంటూ ఒక సపరేట్ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది . జనాలకు యూస్ అయ్యే టిప్స్ కూడా ఇస్తూ ఉంటుంది. రీసెంట్ గా నేను సెల్ఫిష్ అంటూ ఒక వీడియోని విడుదల చేసింది . ఆ సమయం లో నేను అలాంటివి చేయను అంటూ ఓపెన్ గా చెప్పేసింది .

ఆమె ఆ వీడియోలో మాట్లాడుతూ పీరియడ్ సమయంలో కాఫీ టీలు నేను అస్సలు తాగను ఎందుకంటే .. అవి ఆ నొప్పిని ఇంకా ఎక్కువ చేసేస్తాయి .. మరీ ముఖ్యంగా నడుము నొప్పి పొత్తి కడుపునొప్పి.. వాంతులు అయ్యేలా ఉంటూ ఉంటుంది అందుకే ..అవి తాగితే సమస్య మరింత ఎక్కువ అవుతుంది అని .. నేను అవి తాగును నాలుగు రోజులు దాకా వాటి జోలికి వెళ్ళను .. అలాగే మీరు కూడా పీరియడ్ సమయంలో కాఫీ జోలికి వెళ్లదు ఏదైనా ఒకవేళ తాగాలి అనిపిస్తే లెమన్ టీ .. అల్లం చాయ్ మాత్రమే తాగండి .. ఎందుకంటే అవి బ్లోటింగ్ కి సహాయపడతాయి అంటూ ఆడవాళ్లకు ఉపయోగకరమైన విషయాలను పచ్చిగా బోల్డ్ గా ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పేసింది “. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!