మెగాస్టార్ భార్య సురేఖతో షాకింగ్ విషయాలను రివీల్ చేసిన సావిత్రి కూతురు.. మా అమ్మ ఆస్తులు పోగొట్టింది నిజమే అంటూ.. ?!

మహానటి సావిత్రి అంటే అభిమానించ‌ని తెలుగు ప్రేక్ష‌కుటుండ‌ర‌న‌టంలోఅతిశ‌యోక్తి లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ఎందరో స్ట‌ర్ హీరోలు కూడా సావిత్రిని అమ్మ అంటూ అభివర్ణిస్తూ ఉంటారు. ఇక సావిత్రి క్లాసిక్స్ పేరుతో ఆమె కుమార్తె చాముండేశ్వరి ఇటీవ‌ల ఒక బుక్ రెడ్డీ చేసింది. కాగా తాజాగా ఆ బుక్ ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి భార్య‌ సురేఖ కూడా పాల్గొన్నారు. అంతేకాదు సహజనటి జయసుధ, మురళి మోహన్, పరుచూరి గోపాల కృష్ణ, అల్లు అరవింద్ లాంటి ఎంద‌రో ప్రముఖులు అతిథులుగా వ‌చ్చారు. ఈ ఈవెంట్ లో ఒక ఆసక్తికర విష‌యం జ‌రిగింది. చిరంజీవి భార్య‌ సురేఖ అడ‌పాద‌డ‌పా సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తుంటారు. కానీ ఎప్పుడు ఆమె వేదికపై మాట్లాడిందే లేదు.

కానీ ఏకంగా సావిత్రి గారి బుక్ లాంచ్ లో సురేఖ.. చాముండేశ్వరిని ఇంటర్వ్యూ చేయ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాని క‌లిగించింది. చాముండేశ్వరి సావిత్రి గురించి అనేక ఆసక్తికర విషయాలు సురేఖతో షేర్ చేసుకుంది. సావిత్రి బుక్ లాంచ్ ని చిరంజీవి గారితో చిన్న ప్రెస్ మీట్ పెట్టి చేద్దామ‌ని భావించా. అలాగే చేద్దాం అని ఆయ‌న అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఇంత పెద్ద ఈవెంట్‌లా ఆయ‌నే ప్లాన్ చేసారు. మా అమ్మకి చిరంజీవి పెద్దకొడుకు లాగా అని చాముండేశ్వరి తెలిపింది. ఆ మాట వినగానే చిరు చేతులెత్తి నమస్కరించాడు. ఇక చాముండేశ్వరి.. సురేఖతో అనేక విషయాలు మాట్లాడుతూ ఆస్తుల ప్రస్తావ‌న తెచ్చింది. చాలా మంది అంటారు.. సావిత్రి ఆస్తులు మొత్తం పోగొట్టింది.. పిల్లలకు ఏమి మిగ‌ల్చ‌లేదు అని అంటారు. అది స‌రైన మాట‌ కాదు. ఎందుకంటే అమ్మ దగ్గర చాలా ఆస్తి ఉంది.

అందులో పోగా, మోసం చేసే వేరేవాళ్లు లాక్కున్నా కూడా.. మాకు సరిపడేంత ఆస్తి మిగిలేఉంది. నేను తమ్ముడు ఏ లోటు లేకుండా బతకగలిగేంత ఆస్తి అమ్మ నుంచి మాకు వచ్చింది. ఆ విషయంలో మాకెప్పుడూ బాధ కూడా లేదు అని చాముండేశ్వరి వివ‌రించింది. తమ్ముడు అమెరికాలో బాగా సెటిల్ అయ్యాడని.. త‌ను ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను అని చాముండేశ్వరి తెలిపింది. సావిత్రి అప్పట్లో సంపాదించిన ఆస్తులు ఇప్పుడు ఉండి ఉంటే కొన్ని వేల కోట్లు అయి ఉంటాయని చాలా మంది అంటారు. చివరిరోజుల్లో సావిత్రి మోసపోవడమే కాక ఆరోగ్య సమస్యలతో కోమాలోకి వెళ్లిన సంగతి అంద‌రికి తెలుసు. అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పటి దుర్భర పరిస్థితులని నేను గుర్తు చేసుకోకూడదు అనుకుంటున్నను చాముండేశ్వరి ఎమోషనల్ అయ్యింది.