ఫ్లాప్ మూవీతో మాస్ మహారాజ్ బ్లాస్టింగ్ రికార్డ్.. మ్యాటర్ ఏంటంటే..?!

మాస్ మహారాజ్ రవితేజకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సక్సస్ ఫెయిల్యూర్‌ల‌తో సంబంధం లేకుండా వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్న రవితేజ ప్రస్తుతం విజయవంతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ అయిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదన్న సంగతి తెలిసిందే. యాక్షన్ ప్రియులకు మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అయింది. భగవంత్ కేసరి, లియో సినిమాలతో పోటీ పడడంతో టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ గా నిలచింది. అయినా సక్సెస్ లతో సంబంధం లేకుండా రవితేజ క్రేజ్ మరింతగా పెరుగుతుంది.

 

అయితే కథ, స్క్రీన్ ప్లే విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే టైగర్ నాగేశ్వరరావు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచేది అంటూ చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా మాస్ మహారాజ్ కెరీర్‌లోనే రికార్డును క్రియేట్ చేసి పెట్టింది. యూట్యూబ్‌లో టైగర్ నాగేశ్వరరావు హిందీ వర్షన్ క్రియేట్ చేసిన రికార్డ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఈ రికార్డు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. యూట్యూబ్లో ఈ సినిమా హిందీ వర్షన్ కు 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. టైగర్ నాగేశ్వరరావు హిందీ వెర్షన్‌కు పది లక్షల లైకులు వచ్చాయి.

It's Official: Ravi Teja, Harish Shankar to recreate Mass Mania - Telugu News - IndiaGlitz.com

రెండు నెలల క్రితం యూట్యూబ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆర్కేడి స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్‌లో హిందీ వర్షన్ రిలీజ్ చేసింది. రవితేజ మూవీస్ సాధించిన రికార్డ్ తాజాగా మూవీ ప్రొడక్షన్ హౌస్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. రవితేజకు సీరియస్ సినిమాల కంటే ధమాకా తరహా సినిమాలు బాగా సూట్ అవుతాయని అభిప్రాయం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రవితేజ రూ.25 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. మిరపకాయ తర్వాత రవితేజ హరీష్ కాంబోలో వ‌స్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.