లోకేష్ – రజినీ కాంబోలో నాగ్.. ఎలాంటి పాత్రలో కనిపిస్తాడంటే..?!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ వరుస విజయాలను సాధిస్తూ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం కోలీవుడ్ సినిమాలతోనే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న లోకేష్.. ప్రస్తుతం రజనీకాంత్ కాంబోలో సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో నాగార్జున ఓ కీల‌క‌ పాత్రలో నటిస్తున్నాడంటూ వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే నాగార్జున రోల్‌ ఈ సినిమా కథను మలుపు తిప్పే విధంగా స్టోరీ ని డిజైన్ చేశాడట లోకేష్ కనగ‌రాజ్‌. ఇక నాగార్జున రోల్ సినిమాకి హైలెట్గా నిలవనిందని తెలుస్తుంది.

Thalaivar 171 Big Buzz Superstar Nagarjuna In Talks To Cast For Rajinikanth  And Lokesh Kanagaraj Film Reports - Entertainment News: Amar Ujala -  Thalaivar 171:'थलाइवर 171' पर आया बड़ा अपडेट, फिल्म में

నా సామిరంగా సినిమాతో సక్సెస్ అందుకున్న నాగ్‌.. వరుసగా తమిళ్ సినిమాల్లో ఆఫర్లను అందుకుంటు గెస్ట్ రోల్స్ లో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ధనుష్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమాలో నాగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా నాగార్జున గెస్ట్ రోల్ లో నటించడానికి మొదటి నుంచి ఆసక్తి చూపుతూ ఉంటాడు. గెస్ట్ రోల్ లో నటించడం గురించి కొంతమంది విమర్శలు చేసిన ఏమాత్రం పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ఉండే నాగ్.. రజిని సినిమాలో కీలకపాత్రలో నటించడం ప్రస్తుతం వైరల్ గా మారింది. బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో వ‌స్తున్న ఈ సినిమా టైటిల్ అతి త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయ‌నున్నారు.

Thalaivar 171 buzz - Nagarjuna to star in Rajinikanth and Lokesh Kanagaraj's  film? Key details inside

అయితే లోకేష్ – రజిని కాంబోలో నాగార్జున నటిస్తున్నాడన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ వేట్రయాన్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బిజీ కానున్నాడు. లియో సీక్వెల్ విషయంలో నెగిటివ్ కామెంట్స్ రావడంతో తర్వాత ప్రాజెక్టుల విషయంలో లోకేష్ కనగ‌రాజ్‌ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున సోలో హీరోగా కొత్త ప్రాజెక్ట్‌లేవి ఇప్పటివరకు అనౌన్స్ చేయాలేదు. కాగా త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 కూడా స్టార్ట్ కానుందని.. ఈ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరించనున్నాడు అంటూ తెలుస్తుంది.