రాజమౌళి తో ఒక సినిమా అయినా చేయాలని ఉంది.. బాలీవుడ్ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన తెర‌కెక్కించిన‌ మొదటి పాన్ ఇండియా మూవీతోనే ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ లో సక్సెస్ సాధించడం అంటే సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లతో పోల్చుకుంటే రాజమౌళి అన్ని క్రాప్ట్‌లపైన మంచి ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. అందుకే తన సినిమాల్లో ప్రతి ఒక్క మూవీతో ది బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తన పర్ఫెక్షన్ తో తెరకెక్కించిన ప్రతి సినిమాను బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.

SS Rajamouli Biography: Birth, Age, Family, Career, Movies, Net Worth &  More!

ఇలాంటి రాజమౌళితో ప్రస్తుతం సినిమా చేసేందుకు పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్క హీరో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ రాజమౌళి వరుసగా తెలుగు హీరోలని తన సినిమాల్లో తీసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇది ఓ రకంగా టాలీవుడ్‌కు చాలా మంచి విషయం అని చెప్పాలి. ఇదిలా ఉంటే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తెలుగు సినిమా స్థాయిని పెంచడమే కాదు ఆస్కార్ లెవెల్ కు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఆయనకు మించిన దర్శకులు మరొకరు లేరని ప్రూవ్ చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రాజమౌళి.. పాన్ వరల్డ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు.

Ranveer Singh says 'mai laya hu anda' as he confesses failing in maths |  Bollywood - Hindustan Times

ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ నా సినీ కెరీర్ మొత్తంలో రాజ‌మౌళితో ఒక్క సినిమా అయిన చేయాలని ఉందని.. కచ్చితంగా చేసి తీరుతానంటూ శప‌ధం చేశాడు. ప్రస్తుతం రణవీర్ చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో వీరిద్దరి కాంబో అదిరిపోతుందని.. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ తో రణ్‌వీర్ సింగ్ సినిమా రావడం అంటే అది ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ సక్సెస్ అవుతుందంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజమౌళి తన నెక్స్ట్ సినిమాలో రణ్‌వీర్ సింగ్ నటించిన ఆశ్చర్యమైన అవసరం లేదు.