ప్రేయసిని పెళ్లాడిన టాలీవుడ్ యంగ్ హీరో.. పిక్స్ వైరల్..?!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారువీర్‌ ఎంతో కాలం నుంచి కల్పన రావుతో ల‌వ్‌లో ఉన్నారు. ఇటీవ‌ల క‌ల్ప‌న‌ను వివాహం చేసుకున్నాడు తిరువీర్‌. ఇరు కుటుంబాలు కొందరు సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక తన పెళ్లి ఫోటోలను తిరువూరు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ కొత్త ఆరంభం అంటూ లవ్ సింబల్ ను క్యాప్షన్ గా జోడించాడు హల్దీ వేడుకలతో పాటు పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫొటోస్ సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసుకున్నాడు. కుండలో ఉంగరం ఆట ఆడిన ఫోటోలు కూడా ఆయన షేర్ చేశాడు. ప్రస్తుతం ఈయన పెళ్లి ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారడంతో ఆయన అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈయనకు విషెస్ తెలియజేస్తున్నారు.

hero thiruveer got marriage with kalpana rao in grand manner

మొదట నాటకాల్లో నటించిన తిరువీర్.. కొంతకాలం రేడియో జాకీగా పని చేశారు. 2016లో బొమ్మలరామారం సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తర్వాత దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఘాజి సినిమాలో కీలక పాత్రలో మెప్పించాడు. తర్వాత ఏ మంత్రం వేసావే, శుభలేఖలు ఇలా ఎన్నో సినిమాల్లో కనిపించాడు. అయితే జార్జి రెడ్డి సినిమాతో తిరువీర్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇటీవల ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన‌ మల్లేశం, పలాస 1978 సినిమాల్లో కీలక పాత్రలో మెప్పించాడు తిరువీర్. టాలెంటెడ్ న‌టుడిగా ఎంతో మంది ప్రశంసలు అందుకున్న ఈ యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని హీరోగా వ‌చ్చిన టక్ జ‌గ‌దీష్‌ సినిమాలో నెగిటివ్ రోల్‌లో మెప్పించాడు. ఈ మూవీతో మరింత పాపులారిటీ దక్కింది.

hero thiruveer got marriage with kalpana rao in grand manner

అయితే ఇటీవల రిలీజై బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న హారర్ మూవీ మసూదాతో తిరువీర్ కెరీర్‌కు బిగ్ బ్రేక్ వ‌చ్చింది. ఈ సినిమాలో తిరువీర్ హీరోగా నటించాడు. గతేడాది తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కామెడీ ఎంటర్టైర్ పరేషాన్ సినిమాలోను హీరోగా మెప్పించాడు. ఈ సినిమాలో ఆయన నటన ఆకట్టుకుంది. కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లోను కీలకపాత్రలో కనిపించాడు. ఇక ఇటీవల ఆయన నటించిన మోక్ష పట్నం, పారాహుషార్ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ప్రస్తుతం ఆయన భగవంతుడు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ను బిజీగా గడుపుతున్న తిరువీర్.. తాజాగా వివాహం చేసుకొని ఆ ఫొటోస్ నెటింట‌ షేర్ చేయడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. జంట చూడముచ్చటగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.