నాన్ పాన్ ఇండియా కేటగిరిలో ఇప్పటివరకు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయినా మహేష్ రేర్ రికార్డ్.. ఏంటో తెలుసా..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను సృష్టించిన మ‌హేష్‌..రాజమౌళి మూవీతో అసలు సీసలు పాన్ ఇండియన్ స్టార్ గా మారెందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయమని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులంతా కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు సాధించిన నాన్ పాన్ ఇండియా రికార్డ్ ఇదేనంటూ.. ఇప్పటివరకు ఎవరు కూడా టచ్ చేయలేకపోయారంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ మహేష్ సాధించిన ఆ రికార్డ్‌ ఏంటో ఒకసారి చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన సంగతి తెలిసిందే.

Guntur Karam Movie 4 Days Share in Both Telugu States - businessoftollywood

అలా గుంటూరు కారం తో సహా మహేష్ చివరిగా నటించిన ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డ్‌ల వర్షం కురిపించాయి. మహేష్ బాబు 5 సినిమాలతో సాధించిన షేర్స్ చూస్తే నాన్ పాన్ ఇండియా క్యాటగిరీలో ఈ రేంజ్ షేర్స్‌ ఏ సౌత్ హీరో కూడా అందుకోలేకపోయాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వ‌చ్చిన గుంటూరు కారం ప్లాప్ టాక్‌తో కూడా బాక్సాఫీస్ దగ్గర రూ.111.81 కోట్లా గ్రాస్ వ‌శూళ‌ను కల్లగొట్టింది. దీనికంటే ముందు పరశురాం పెట్ల డైరెక్షన్ లో తెరకేక్కిన సర్కారు వారి పాట సినిమా కూడా మిక్స్డ్ టాక్‌తో రూ.110.12 కోట్ల గ్రాస్ వశూళ‌ను అఏదుకుంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ హీరోగా.. సరేలేరు నీకెవరు సినిమా వ‌చ్చి బాక్స్ ఆఫీస్ వద్ద రూ.138.78 కోట్ల కలెక్షన్లను సాధించింది.

Mahesh Babu Maharshi Movie Review & Rating {3/5 }

సంక్రాంతి బాక్స్ ఆఫీస్ హెడ్‌గా నిలిచి రికార్డులు సృష్టించింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహేష్ హీరోగా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన మూవీ మహర్షి.. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.14.58 కోట్ల కలెక్షన్‌లు సాధించి బాక్స్ ఆఫీస్ హిట్‌గా నిలిచింది. మహేష్, కొరటాల శివ కాంబోలో వచ్చిన రెండో మూవీ భరత్ అనే నేను సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.101 కోట్ల షేర్లను రాబట్టి హిట్ అందుకుంది. ఇలా మొత్తంగా మహేష్ బాబు గత ఐదు సినిమాలతో రూ.566.29 కోట్ల షేర్ ను సంపాదించాడు. ఓ రకంగా పాన్ ఇండియా సినిమాలు కాకపోయినా ఈ రేంజ్ లో షేర్ వసూలు చేయడం అనేది నిజంగానే నాన్ పాన్ ఇండియా క్యాటగిరీలో సరికొత్త రికార్డ్‌ అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఈ రికార్డ్ కేవలం మహేష్ కు మాత్రమే సొంతమైంది.