“నేను పెళ్లికి రెడీ”.. అభిమానులకి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చిన కీర్తి సురేష్..!

కీర్తి సురేష్.. సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటుంది . మిగతా హీరోయిన్స్ ఎక్కువగా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ తమకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకోవడానికి పాకులాడుతూ ఉంటారు. కానీ హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రం ఆ విషయంలో చాలా డిఫరెంట్.. చాలా పద్ధతిగా తన లిమిట్స్ లో తాను తన వర్క్ చేసుకొని ముందుకు వెళ్లిపోతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా స్కిన్ షో కి దూరంగా ఉండే కీర్తి సురేష్ రీసెంట్ గానే బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది .

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక కచ్చితంగా ఎక్స్పోజింగ్ చేయాల్సిందే అన్న కామెంట్స్ మనం ఎప్పటినుంచో వింటున్నాము. మరి కీర్తి సురేష్ ఎక్స్పోజింగ్ చేస్తుందా ..? అలాంటి రూల్స్ ని బ్రేక్ చేస్తుందో ..?తెలియాలి అంటే మరికొద్ది కాలం వేచి చూడాల్సిందే . ఇలాంటి క్రమంలోనే కీర్తి సురేష్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి అంటూ కీర్తి సురేష్ పెళ్ళికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇలాంటి మూమెంట్లోనే చాలా ట్రెడిషనల్ గా రెడీ అయిన కీర్తి సురేష్ తన ఫోటోని షేర్ చేస్తూ తన ఇన్స్టా స్టోరీలో..” మీరు పెళ్లికి సిద్ధమైనప్పుడు సెల్ఫీ తప్పనిసరి” అంటూ ఒక సెల్ఫీ ఫోటోను షేర్ చేసింది. దీనితో ఫాన్స్ షాక్ అయిపోతున్నారు . “నువ్వు పెట్టిన పోస్ట్ కి అర్థం ..నువ్వు పెళ్లికి రెడీ అయ్యావా..? అని చెప్తున్నావా.. లేకపోతే వేరే వాళ్ళ పెళ్లికి నువ్వు ముస్తాబు అయ్యావా..? అని చెప్తున్నావా అంటూ కన్ఫ్యూషన్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ కీర్తి సురేష్ పెట్టిన పోస్ట్ కి అర్థం ఏంటి ..? ఆమె పెళ్లికి రెడీ అయినట్లా..? ఆమె పెళ్లికి ఆమె రెడీగా ఉన్నట్లా..???