ఇంద్ర vs నరసింహారెడ్డి.. ఏది అతిపెద్ద హిట్..!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు.ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటినుండి ఇప్పటివరకు కూడా అనేక సినిమాలతో అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇక బాలయ్య విషయానికి వస్తే బాలయ్య కూడా ఇండస్ట్రీలో మంచి పేరుని సంపాదించుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు తిరుగులేని హీరోగా రాణిస్తున్నారు. తన తండ్రి తర్వాత బాలకృష్ణ హీరోగా మరి ఇండస్ట్రీలోకి వచ్చి మంచి పేరుని సంపాదించుకున్నారు. ఇద్దరూ కూడా సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరోలే. మంచి పేరు తెచ్చుకున్న వాళ్లు. చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న వాళ్లు.

చిరంజీవి నటించిన సినిమాలో ఇంద్ర సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అలానే బాలయ్య చేసిన సినిమా నరసింహారెడ్డి కూడా అద్భుతంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అయితే ఇంద్ర నరసింహారెడ్డి రెండిట్లో ఏది హిట్ అయింది…? ఫ్యాక్షనిజం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. బి. గోపాల్ దర్శకత్వంలో బాలయ్య నరసింహారెడ్డి సినిమా తెర మీదకు వచ్చింది. బాలయ్య నట విశ్వరూపాన్ని స్క్రీన్ మీద అద్భుతంగా చూపించారు. సిమ్రాన్ అంజలా జావేరి ఈ సినిమాలో బాలయ్య సరసన నటించారు. ఇక మణిశర్మ సంగీతం అందించారు. ఏకధాటిగా ఈ సినిమా ఒక థియేటర్లో 360 రోజులు ఆడింది.