“ఆ పని చేయకపోతే..NTR ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తా”..కోన వెంకట్ సంచలన కామెంట్స్..!

కోన వెంకట్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . స్టార్ రైటర్ .. ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన కోన వెంకట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కోన వెంకట్ సమర్పణలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. పూర్తి హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటించగా శ్రీనివాసరెడ్డి – సత్య – అలీ – షకలక శంకర్ లాంటి వాళ్ళు కీలకపాత్రలో కనిపిస్తున్నారు.

2014లో వచ్చిన గీతాంజలి సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది . ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు . నేడు ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేశారు . ట్రైలర్ ఆద్యంతం అభిమానులను ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే ప్రెస్ మీట్లో పాల్గొన్న కోనా వెంకట్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు . ఇదే క్రమంలో ఎన్టీఆర్ తో అదుర్స్ 2 చేస్తాను అంటూ మాట ఇచ్చాడు . కోన వెంకట్ కామెంట్స్ ఒకింత ఆసక్తి రేపాయి .

ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానం అభిమానులకి కూడా ఆశ్చర్యకరంగా అనిపించింది . అదుర్స్ సినిమా సూపర్ సూపర్ హిట్ అయింది . వివి వినాయక దర్శకత్వంలో కోనా వెంకట్ రచయిత గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి సీక్వెల్ రావాలి అంటూ చాలా కాలం గా ట్రై చేస్తున్నారు మేకర్స్. అభిమానులు కూడా ఎంతో ఆశతో అడుగుతున్నారు .

అయితే ఎన్టీఆర్ మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు . తాజాగా కోన వెంకట్ మాట్లాడుతూ..” అదుర్స్ 2 కచ్చితంగా చేస్తాము ..అవసరమైతే ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి పిలకపెట్టుకొని నిరాహార దీక్ష చేస్తాను.. ఎందుకంటే ఎన్టీఆర్ చేసిన చారి పాత్ర టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే ఏ నటుడు చేయలేనటువంటి పాత్ర ” అంటూ ఓ రేంజ్ లో ఎన్టీఆర్ ని పొగిడేసారు . ప్రజెంట్ దీనికి సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!