బ్లాక్ రైస్ తో దోసలు తయారీ విధానం అండ్ బెనిఫిట్స్.‌.!

బ్లాక్ రైస్ అనేది ప్రోటీన్ లను మరియు విటమిన్ లను అందించడంలో సహాయపడుతుంది. బ్లాక్ రైస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఫాస్ట్ అనగానే గుర్తుకొచ్చేది ఇడ్లీ మరియు దోశలు మాత్రమే. అయితే ఇడ్లీ దోశలు బియ్యం వేయడం వల్ల పెద్ద ఎత్తున కార్బోహైడ్రేట్లు చేరుతాయి.

ఇక సాధారణ పాలిష్ బియ్యం బదులుగా బ్లాక్ సైజ్ వేసి దోస పిండి తయారు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. బ్లాక్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్లు అనేక గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. ఉదాహరణకు బ్లాక్ రైస్ లో ఉండే గుణాలు మీ ప్రాణాంతక మరియు గుండె జబ్బులను తగ్గిస్తాయి.

బ్లాక్ రైస్ లో ఉండే గుణాలను దోస రూపంలో మీ సొంతం చేసుకోవచ్చు. ముందుగా బ్లాక్ రైస్ బియ్యాన్ని నానబోసుకొని అనంతరం మిక్సీ జార్లో వేయండి. అలా పేస్టుగా చేసుకున్న ఈ మిశ్రమాన్ని దోస లాగా వేసుకుని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ప్రతిరోజు కనుక మీరు బ్లాక్ రైస్ తో దోస వేసుకుని తింటే మీకు ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి.