తండ్రి భుజాలపై కూర్చొని కెమెరాకు స్టిల్స్ ఇస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ పై ఫోటోలో తండ్రి భుజాలపై కూర్చొని కెమెరాకు స్టిల్ ఇస్తున్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ లో ఓ క్రేజీ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ వైవిద్యమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు ఈ కుర్రాడికి అమ్మాయిల్లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఈ హీరో ఎవరో కాదు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు మూవీతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని టాలీవుడ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఒక్కసారిగా విజయ్‌ మార్కెట్ ఈ సినిమాతో భారీ లెవెల్ కు పెరిగింది.

ఆ తర్వాత నటించిన గీతగోవిందంతోను ప్రశంసలు అందుకున్నాడు. డియర్ కామ్రేడ్, టాక్సీవాలాలో మెప్పించాడు. ఇక గత ఏడాది ఖుషి సినిమాని తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. ఇక తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చాడు రౌడీస్టార్‌. ఈ సినిమా నిన్న రిలీజై యావ‌రేజ్ టాక్ అందుకుంది. ఇందులో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటించింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో తను ఫ్యామిలీ గురించి.. తల్లిదండ్రులు, తమ్ముడు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కష్టాలు. తన తండ్రి పడ్డ శ్రమ గురించి విజయ్‌ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో కూడా తండ్రి గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు.

ఆయన చేసిన త్యాగాలు.. కష్టం అన్నింటికీ సరైన ప్రతిఫలం అందించాలని అనుకుంటున్నట్లు వివరించాడు. తాజాగా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ సందర్భంగా మరోసారి తన తండ్రిపై ప్రేమను వెల్లడించాడు. ఇక తాజాగా తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసుకుంటూ.. ఆయనే నా ఫ్యామిలీ స్టార్, ఆయనే నా సూపర్ స్టార్ అంటూ వివరించాడు. తమ కోసం కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశాడని చెప్పుకొచ్చిన విజయ్.. ఈ ఫోటోలతో పాటు ఎమోషనల్ పోస్టులు షేర్ చేసుకున్నాడు. ఎప్పుడైనా మేము తప్పు చేసి ఉంటే.. మిమ్మల్ని తలవంచుకునేలా చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి డాడీ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి నా తండ్రి కారణమని అందులో చెప్పుకొచ్చాడు. చిన్ననాటి నుంచి తన తండ్రితో కలిసిన ఫోటోలు అన్నింటిని ఈ వీడియోలో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ చేసిన పోస్ట్ నెటింట వైర‌ల్‌గా మారింది.