సీనియర్ హీరోయిన్స్ అంతా ఒకే పందాలో వెళ్తున్నారే.. అన్ని అవే సినిమాలు..?!

హీరోయిన్ అంటే గ్లామర్ షోలకు, హీరోతో రొమ్యాన్స్‌కు మాత్రమే పరిమితం కావాలా.. సాంగ్స్‌లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలా.. సినిమా మొత్తం హీరో పైనే ఆధారపడి ఉండాలా.. మేము కూడా ఓ సినిమాను మా సొంత భుజాలపై మోయగలం. ఎటువంటి మెయిల్ లీడ్ లేకుండా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా చేసి సక్సెస్ సాధించగలం అని ఒకరితో ఒకరు శపథాలు చేసుకొని మరి లేడీ సెంట్రిక్ సినిమాలతో పోటీ పడుతున్నారు మన హీరోయిన్లు. హీరోలతో ఆఫర్స్ అందుకోలేకపోతున్నా.. హీరోయిన్లంతా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ.. తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

ప్రస్తుతం అంతా కొత్త హీరోయిన్ల జమానా నడుస్తుండడంతో.. తమన్నా, అనుష్క, నయనతార లాంటి సీనియర్ కథానాయకలంతా లేడీ ఓరియంటెడ్ సినిమాలోనే బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా తమన్నా ఓదెల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరో రెండు ఫీమేల్ సెంటర్ సినిమాలో త‌మ్మ‌న్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే టాలీవుడ్ ముదురు బ్యూటీ అనుష్క డైరెక్ట‌ర్‌ కృష్‌తో ఘాతి సినిమా చేస్తుంది. దీంతో పాటు మలయాళంలోను కథనార్‌ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో నటిస్తుంది.

ఇక రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లు అందుకుంటున్నా.. మ‌రోప‌క్క ఫీమేల్ లీడ్ సినిమాల‌పై కూడా ఫోక‌స్ చేస్తుంది. ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో ఈ రెండు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలోను నటిస్తోంది. ఇక సీనియర్ నటి నయనతార హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే ఆపేసింది. దాదాపు నటిస్తున్న అన్ని సినిమాలు ఫిమేల్ సెంట్రిక్‌ సినిమాలే కావడం విశేషం. రకుల్, పూజ హెగ్డే సైతం ఇటీవల లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కాజ‌ల్ కూడా తాజాగా స‌త్య‌భామాతో లేడి ఓరియంటెడ్ సినిమాలో న‌టించింది. ఇలా సీనియర్ హీరోయిన్లంతా లేడి ఓరియంటెడ్ సినిమాల‌ను బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటూ న‌టిస్తున్నారు అన‌టంలో అతిశ‌యోక్తి లేదు.