గుండె బరువెక్కి పోయింది.. హీరో నాని ఎమోషనల్ పోస్ట్..!

టాలీవుడ్ హీరో నాని ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అష్టాచమ్మా సినిమాతో హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. పలు చిత్రాల్లో నటించి హిట్స్‌ను తన కాతాలో వేసుకుని నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఇటీవలే నాని నటించిన రెండు సినిమాలు దసరా, హాయ్ నాన్న బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక నాని కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం మాత్రం జెర్సీ అనటంలో అతిశయోక్తి లేదు. ఈ మూవీ 2019 లో వచ్చే బ్లాక్ బస్టర్ అందుకోవటంతో పాటుగా ఎన్నో అవార్డులు గెల్చుకుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయి 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా.. పలు చోట్ల జెర్సీ స్పెషల్ పోస్ వేశారు. దీనతో నాని ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. “ఈరోజు అర్జున్ ప్రయాణం నుండి ఉపశమనం పొంది మళ్లీ వీడ్కోలు చెప్పటానికి అవకాశం నుండి తిరిగి వచ్చినట్లు కనిపించింది. గుండె బరువెక్కి పోయింది…నిండిపోయింది” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం నాని పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.