బ్రెయిన్ స్ట్రోక్ ముందు కనిపించే లక్షణాలు ఇవే.. తప్పక తెలుసుకోండి.. ?!

ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్, వాతావరణ పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరికి ఎలా స్ట్రోక్ వస్తుందో కచ్చితంగా చెప్ప‌లేము. గుండెపోటు ప్రస్తుతం యూత్ లోను సాధారణంగా వినిపిస్తోంది. జ్వరంల హాట్ స్ట్రోక్ చాలామందికి ఇట్టే వచ్చి వెళ్తుంది. అలాగే ఏడాదిలో లక్షల మంది మెదడుకు రక్తప్రసరణ జరగక బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. దీని కారణంగా భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ హార్డ్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్లు రాకుండా ముందే వీటి లక్షణాలు ఏంటో తెలుసుకుని జాగ్రత్తగా పడ‌వచ్చు. ఇంతకీ అవేంటో చూద్దాం. బ్రెయిన్ స్ట్రోక్ లేదా హాట్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరం ఒక్కసారిగా బలహీనంగా మారుతుంది.

అయితే కొందరిలో శరీరం తిమ్మిరి పట్టినట్లుగా కూడా అనిపిస్తుంది. మాట్లాడే సమయంలో ఇబ్బందులు.. గతంలో లాగా సాధారణంగా మాట్లాడకుండా తడపడం, పదాలను సరిగ్గా ఉచ్చరించలేకపోవడం, ఎదుటివారితో మాట్లాడే విషయం అత్ధంకాక‌పోవ‌డం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల చుట్టూ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకోలేక ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇదే సమయంలో హాట్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కంటి చూపు మందగిస్తుంది. కళ్ళు దెబ్బ తినే పరిస్థితి కూడా ఉంటుంది. దగ్గర ఉన్న వస్తువులను కూడా సరిగ్గా చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక స్ట్రోక్ గురైనప్పుడు తమని తాము సరిగ్గా బ్యాలెన్స్ కూడా చేసుకోలేరు. నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది.

శరీరంపై అదుపు కోల్పోతారు. ఉన్నట్టుంది కుప్పకూలిపోవడం తీవ్రమైన అలసట లాంటివి ఎదురవుతూ ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు చేతులు, కాళ్లు, తలనొప్పితో పాటు ముఖంపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. కనుక ఈ పై లక్షణాల్లో ఏది కనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే బ్రెయిన్ స్ట్రోక్ త్వరగా గుర్తించేందుకు ప్రస్తుతం వైద్యులు FAST పద్ధతిని ఆచరణలో పెట్టారు. ఆంగ్లంలో ఫాస్ట్ పదంలోని అక్షరాలను గుర్తు పెట్టుకొని వ్యవహరించమని సూచిస్తారు. F అంటే ఫేస్ డ్రాపింగ్‌, A అంటే ఆమ్ వీక్నెస్, S స్పీచ్ డిఫికల్టీ, Tఅంటే టైం టు కాల్ ఎమర్జెన్సీ ఈ టెర్మినాలజీని గుర్తు పెట్టుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.