హనుమాన్ వెరీ చీప్ ఫిలిం.. ‘ ఆదిపురుష్ ‘ తో కంపేర్ చేస్తూ వర్మ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ వివాదాస్ప‌ద‌ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తరచూ ఏదో ఒక సంచలన ట్విట్ చేసి వివాదాల్లో చిక్కుకునే ఈయన.. ఎప్పటికప్పుడు ట్రోల్స్ కు గురవుతూనే ఉంటాడు. కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే కాకుండా.. రాజకీయాలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనగా మారుతూ ఉంటాడు. ఇలా నిత్యం ఏదో కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో కాంట్రవర్షియల్ డైరెక్టర్గా క్రేజ్‌ సంపాదించుకున్న వర్మ.. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సంచలన ట్విట్‌లు చేస్తూ నెటింట వైరల్ అవుతూ ఉంటాడు.

HanuMan (Hanu Man) Movie (2024): Release Date, Cast, Ott, Review, Trailer,  Story, Box Office Collection – Filmibeat

ఈ నేపథ్యంలో తాజాగా వర్మ హనుమాన్ మూవీ గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. తేజా సజ్జ హీరోగా.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా విజువల్ వండర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన టాలీవుడ్మూవీల‌లో టాప్ వన్ సినిమాగా క్రేజ్‌ సంపాదించుకొని రికార్డులు సృష్టించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రూ.300కు పైగా గ్రాస్ వ‌శుళ‌ను కొల్లగొట్టి ఆడియన్స్ ను ఫిదా చేసింది. అయితే ఈ మూవీలో గ్రాఫిక్స్ చూసి వర్మ కూడా ఆశ్చర్యపోయానని.. ఆదిపురుష్‌ సినిమాలోని గ్రాఫిక్స్ ని బయట దేశాల్లో ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి తెరకెక్కించారని అయ‌న వివ‌రించాడు.

Ladki' is my tribute to Bruce Lee: Ram Gopal Varma

హనుమాన్‌కి సంబంధించిన గ్రాఫిక్స్ హైదరాబాద్‌లో చిన్న‌ ఆఫీసులో చేసి అద్భుతమైన ఔట్ పుట్ తో ఆకట్టుకున్నారని.. ఆ విజువల్ ఎఫెక్ట్స్ కు నేను ఆశ్చర్యపోయానని.. ఇదే విషయాన్ని ప్రశాంత్ వర్మను ప్రశ్నించాను అంటూ చెప్పుకొచ్చాడు. దానికి అతను ఒక్క మాట చెప్పాడు.. వేరే దేశాల్లో చేసిన ఇక్కడ చేసిన గ్రాఫిక్స్ డిజైన్ ఒక రూమ్ లోనే చేయాలి. కానీ మనకి కావాల్సింది టాలెంట్ ఉన్న వ్యక్తి అంటూ బదులిచ్చాడని.. ఆర్‌జీవి వివరించాడు. ప్రశాంత్ వ‌ర్మ చెప్పిన ఆ మాటలు నూటికి నూరుపాళ్ళు కరెక్ట్ అని.. బడ్జెట్ పరంగా ఆదిపరుష్‌తో పోలిస్తే హనుమాన్ వెరీ చీఫ్ ఫిలిమ్.. కానీ రిజల్ట్ పరంగా హనుమాన్ ఏంటో ప్రూవ్‌ చేసుకుంది అంటూ ఆర్జీవి వివరించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.