ఆ పని చేశాక మృణాల్ హీరోయిన్ అయ్యిందా..? ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మ్యాటర్..!

మృణాల్ ఠాకూర్ .. ఇండస్ట్రీలో ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ .. ఎలా అంటే ఆమె చేసిన సినిమా ప్రతిది హిట్ అయిపోతుంది . సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది . కేవలం మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ తో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న టాక్ కూడా వైరల్ గా మారింది.

ఇలాంటి క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్ ఠాకూర్ మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . నిజానికి మృణాల్ ఠాగూర్ ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవ్వాలి అని అనుకోలేదట . ఆమె పెళ్లి చేసుకొని పిల్లలతో హస్బెండ్ తో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అనుకునిందట. కానీ సడన్గా మోడలింగ్ పై ఇంట్రెస్ట్ రావడం తర్వాత సీరియల్స్ లోకి వెళ్లడం .. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో తాను అనుకున్న కెరియర్ను పక్కన పెట్టేసి సగంలో ఆశ పుట్టిన కెరియర్ పై ఫోకస్ చేసిందట.

తన పెళ్లి.. పిల్లలు అనే ఇష్టాన్ని పక్కన పెట్టేయడంతోనే ఆమె ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయింది అని స్వయాన మృణాల్ ఠాకూర్నే చెప్పడం అభిమానులకు సైతం ఆశ్చర్యకరంగా మారిపోయింది. ప్రజెంట్ మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ . అంతేకాదు ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న ఫ్యామిలీ స్టార్ కూడా కచ్చితంగా హిట్ అవుతుంది అన్న నమ్మకం జనాల్లో ఉంది..!!