అఖండ 2 అప్డేట్ వచ్చేసిందోచ్.. ఫుల్ క్లారిటీ ఇస్తూ బోయపాటి కామెంట్స్..!

డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో డైరెక్టర్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా శ్రీకాంత్ తదితరులు కలయికలో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెర్కెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “అఖండ” .

మరి తెలుగు సినిమాకి పూర్వవైభవం తీసుకొచ్చిన ఈ సినిమా సీక్వెల్ కోసం ఎందరో ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమా పై లేటేస్ట్ గా బోయపాటి శ్రీను స్పందించడం వైరల్ గా మారింది.అఖండ రెండవ భాగం ఎన్నికల తర్వాత ప్రకటిస్తామని ఈసారి సామాజిక అంశాలతో పార్ట్ 2 ఉండబోతుంది అని కన్పర్శ చేశారు.

దీనితో ఈ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకి ఈ వార్త ఊరటనిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ముందు ముందు రానున్నాయి.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు.’