విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ ” 10 డేస్ కలెక్షన్స్.. మన రౌడీ బాయ్ అంచనాలను అందుకోగలిగాడా..?

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయన ఎన్నో సినిమాలు చేస్తూ ప్రేక్షకులు ని బాగా ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో “గీత గోవిందం” తరువాత రూపొందిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్’ మృనాల్ టాకు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దిల్ రాజ్ నిర్మాత గా వహించాడు.

టీజర్ ట్రైలర్స్ ప్రేక్షకులను అలరించాయి. దీనితో మొదటి నుండి సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. కానీ ఏప్రిల్ 5న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీనితో సో సో ఓపెనింగ్స్ మాత్రమే నమోదుయ్యాయి. పండగ పేరు చెప్పుకొని ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. మరి సెకండ్ వీకెండ్ ఎలా కాష్ చేసుకుంటుందో చూడాలి.

ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే: ఫ్యామిలీ స్టార్ సినిమాకు రూ.41.2 కోట్లు ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.41.5 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.పది రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.16.98 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ.24.52 కోట్లు షేర్ను రాబట్టాల్సి ఉంది.