29 రోజులో సినిమా పూర్తై.. రిలీజై 500 రోజులు ఆడిన మెగ‌స్టార్ మూవీ.. ఏంటో తెలుసా..

తెలుగులో ఒకప్పుడు సీనియర్ స్టార్ డైరెక్టర్లుగా దూసుకుపోయిన దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ ఎలాంటి పేరు సంపాదించుకున్నారో తెలిసిందే. అయితే వీరిద్దరూ ఒకే ఆర్ట్స్ బ్యానర్ నుంచి దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అధినేత కే రాఘవ గారు ఈ ఇద్ద‌రిని టాలీవుడ్‌కు డైరెక్ట‌ర్స్గా ప‌రిచ‌యం చేశారు. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. దాసరి నారాయణ శిష్యుడే ఈ కోడి రామకృష్ణ. గురు శిష్యుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ద‌ర్శ‌కులుగా తీర్చిదిద్దారు ప్రతాప్ ప్రొడక్షన్స్ రాఘవ గారు. కోడి రామకృష్ణారెడ్డి తెర‌కెక్కించిన‌ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ఇప్పటికే రిలీజై 40 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే.

Remembering Veteran Telugu Director Kodi Ramakrishna In Photos

1982 ఏప్రిల్ 23న రిలీజ్ అయినయి సినిమా మొదట యావరేజ్ టాక్ సంపాదించుకున్నా.. మెల్లమెల్లగా ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్గా సంచలన సృష్టించింది. ఏకంగా 512 రోజులు ఏకధాటిగా ఈ సినిమా నడుస్తూనే ఉంది. అప్పటికే యాక్షన్ హీరోగా భారీ పాపులాటి సంపాదించుకున్న‌ చిరంజీవిని రాజశేఖర్ అనే ఒక కామెడీ మిక్స్డ్ ఫ్యామిలీ క్యారెక్టర్ లో చూపించడం.. ఆ సినిమాతో ప్రేక్షకులు మెప్పించడం అంటే సాధారణ విషయం కాదు. అలాంటిది ఈ సినిమాను చిరంజీవితో తెర‌కెక్కించి హిట్ సాధించారు చిరు. కెరీర్‌లోనే మంచి సినిమాల లిస్టులో మొదటి వరుసలో ఉంటుంది.

Intlo Ramayya Veedilo Krishnayya

ఇక ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య సినిమాలో చిరంజీవి స‌ర‌సన జయపాత్రలో హీరోయిన్గా మాధవి నటించి మెప్పించారు. నటి పూర్ణిమా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమా ద్వారా రచయిత గొల్లపూడి మారుతీరావు నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అమాయక స్త్రీలను మాటలతో లోబరుచుకుని జల్సా చేసే ఒక దుర్మార్గుడు సుబ్బారావు పాత్రలో గొల్లపూడి ఆకట్టుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం ఓ సినిమా షూటింగ్ అంటే 150 నుంచి 200 రోజులైనా కచ్చితంగా కావాలి. అలాంటిది అప్పట్లో చిరంజీవి నటించిన ఈ సినిమాను కేవలం 29 రోజుల్లోనే పూర్తి చేసి రిలీజ్ చేశారు కోడి రామకృష్ణారెడ్డి.