కోట్ల ఆస్తి సంపాదించిన ఇప్పటికీ ఫోన్ యూజ్ చేయని ఆ స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లో స్మార్ట్ఫోన్ అనేది జీవితంలో భాగంగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా చిన్న , పెద్దా అంద‌రు స్మార్ట్ ఫోన్లు సింపుల్ గా యూజ్ చేసేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమాంట జనాలకు ఫోన్లు తెగ అలవాటైపోయాయి. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ ఉంటూనే ఉంటుంది. అయితే ఇలాంటి స్మార్ట్ యుగంలో కూడా కోట్ల కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోకి మాత్రం సొంత మొబైల్ ఫోనే లేదట. ఇప్పటికి ఆయన ఫోన్ వాడడ‌ట. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా.. కానీ ఇదే నిజ. అతను ఫోను వాడడు. ఆ స్టార్ హీరో ఎవరు.. ఇంతకీ ఫోన్ వాడకపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.

ఆ స్టార్ హీరో ఎవరో కాదు హాలీవుడ్ కింగ్ అజిత్. తెలుగు వారికి కూడా ఆయన సుపరిచితమే. ఎన్నో హిట్ సినిమాలు తెలుగులో డబ్ కావడంతో అజిత్ కు టాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అయితే అలాంటి అజిత్ ఇప్పటివరకు సొంత ఫోన్ యూస్ చేయలేదట. కోట్లు డబ్బు సంపాదించిన స్మార్ట్ ఫోన్లు వాడడ‌ట. ఈ విషయాన్ని అతనితో పని చేసిన ఓ స్టార్ హీరోయిన్ స్వయంగా వివరించింది. ఆమె మాట్లాడుతూ అజిత్ ఫోన్ అసలు వాడరు. ఒకవేళ ఆయన కలవాలంటే కచ్చితంగా ఆయన స్టాఫ్ ఫోన్ కు కాల్ చేసి అడగాలి అంటూ వివరించింది. ఇక ఓసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడడం ఇష్టం లేక సిమ్ లను కూడా మార్చేస్తూ ఉంటారట.

ఓ సినిమా చేస్తున్న తర్వాత ఆ సినిమా వాళ్ళు మళ్ళీ కాల్ చేయడానికి కూడా అజిత్ అవకాశ‌మివ్వరు. అయితే చాలామందికి ఇక్కడ ఎన్నో సందేహాలు రావచ్చు. మరో సినిమా కావాలంటే ఎలా కాంటాక్ట్ అవుతారు అనుకుంటున్నారా.. అలాంటి సందర్భంలో డైరెక్టర్స్ నేరుగా ఆయనను కలిసి మాట్లాడతారట. సెల్యులార్ టెక్నాలజీ ప్రపంచానికి చాలా దూరంగా ఉండడం అజిత్ కు ఇష్టమట. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే ఈ సెల్యులార్ జీవితానికి దూరంగా ఉండాలని ఆయన నమ్ముతారట. ఈ విషయం నిన్న చాలా మంది ప్రస్తుతం ఆశ్చర్యపోతున్నారు. నిజంగా ఈ కంప్యూటర్ యుగంలో కూడా స్మార్ట్‌ఫోన్ యూజ్‌ చేయడం లేదంటే అజిత్ చాలా గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు.