ఎప్పుడు రామ్ చరణ్ ని కనీసం తిట్టని కూడా సురేఖ ..కొట్టడానికి చెయ్యి ఎత్తడానికి కారణం ఆ హీరో నేనా..? అంత టార్చర్ చేశాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ఎంత ఫేమస్ అయ్యాడో.. ఆయన భార్యగా సురేఖ కూడా అంతే ఫేమస్ అయింది. చాలా చక్కగా ట్రెడిషనల్ గా ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే సురేఖ.. చాలా చాలా కూల్ గా ఉంటుంది. చిరంజీవి మాత్రమే కాదు పలువురు స్టార్ హీరోయిన్స్ కూడా ఇదే విషయం గురించి చెప్పుకొచ్చారు. ఆమె లోని మంచితనాని ఓపెన్ గానే బయట పెట్టారు.

సురేఖ చాలా మంచిది అని.. మేము ఇంటికి వెళ్తే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటుంది అని.. చిరంజీవికి అలాంటి వైఫ్ దొరకడం అదృష్టమని.. చాలా మంది పొగిడేసారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ని సురేఖ ఎంత బాగా చూసుకుంటారో మనకు తెలిసిందే . అయితే చిన్న మాట కూడా తిట్టని .. రామ్ చరణ్ ను ఒక హీరో కోసం సురేఖ చెయ్యి ఎత్తి కొట్టబోయిందట..

ఆ హీరో మరెవరో కాదు వరుణ్ తేజ్ . వరుణ్ తేజ్ – రామ్ చరణ్ చిన్నప్పుడు బాగా అల్లరి చేసుకునే వారట . ఒకానొక సమయంలో వీళ్ళ గోల భరించలేక ఇద్దరిని దూరం దూరంగా పెట్టేసారట. ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో కలిసిన చరణ్ – వరుణ్ తేజ్ బాగా పోట్లాడుకున్నారట. అందరి ముందే రామ్ చరణ్ – వరుణ్ తేజ్ ని తోసేయడంతో సురేఖకు కోపం వచ్చిందట.. ఇలా చేస్తావా అంటూ చేయి ఎత్తి కొట్ట బోయిందట. అప్పుడే చీరంజీవి వచ్చి ఆపేశారట. అలా అమ్మ చేతి దెబ్బలు తప్పించుకున్నాడు ఈ హీరో..!