అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న వెంకీ బ్యూటీ..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కత్రినా కైఫ్.. వాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి వివాహమై మూడేళ్ళు అవుతున్నా ఈ జంట‌కు పిల్లలు లేరు ఈ క్ర‌మంలో ఆమె తల్లిగా ప్రమోషన్ పొందుతుందంటూ.. ఆమె ప్రెగ్నెంట్ గా ఉందంటూ వార్తలు బాలీవుడ్ మీడియాలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే వీరి ఇంటికి వారసుడు రాబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ నెట్టింట‌ సందడి చేస్తున్నారు.

Vicky Kaushal says he shares any news with Katrina first, talks about wedding | Bollywood - Hindustan Times

అయితే వీరు ఇలా అభిప్రాయపడడానికి ఒక స్ట్రాంగ్ రీజ‌న్ ఉంది. అదేంటంటే ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్‌ అంబానీ కుమారుడు అనంత్ అంబాన్ని – రాధిక మర్చంట్ లా ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్ నటీ,నటులంతా హాజరై సందడి చేశారు. అక్కడ కత్రినా కైఫ్ – వికీ కౌశల్ కూడా జంటగా కనిపించారు. కాగా ఈ వేడుకల్లో ఆమె ప్రతిసారి తన పొట్ట కనిపించకుండా దుప్పటతో అడ్డుపెట్టుకుంటూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో నెట్టింట ఈ వార్తలు వైరల్ గా మారాయి. కత్రినా గర్భంతో ఉందని.. తన బేబీ బంప్‌ కనిపించకుండా దాచుకునేందుకే ఇలా అన్నిసార్లు సర్దుకుంటుందని నెటిస‌న్‌లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Vicky Kaushal and Katrina Kaif Return from Jamnagar to Mumbai after attending Anant Ambani and Radhika Merchant's pre wedding ceremony… | Instagram

ఇక తాజాగా అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మరో స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తాను తల్లి కాబోతున్నట్లు తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు కత్రినా కూడా శుభవార్త చెప్పవచ్చని బాలీవుడ్ మీడియా సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక కత్రినా – విక్కీ కౌశల్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని 2021లో ఎంతో ఘనంగా వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ నేప‌ధ్యంలో నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్న సమయంలో కత్రినా తల్లి అవుతుందనే వార్త వైరల్ అవ్వడంతో.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్త‌ల‌పై క‌త్రినా – వికీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.