పెళ్లి పై స్పందిస్తూ ఊహించని షాక్ ఇచ్చిన సిద్ధార్థ్ – అదితి.. అరే ఏంట్రా ఇది..!

హీరోయిన్ అదితి మరియు సిద్ధార్థ్ ప్రేమ గురించి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ వీరిద్దరూ మాత్రం ఇప్పటివరకు వీటిపై స్పందించలేదు. ఇక వీరికి మార్చ్ 27న తెలంగాణలో వనపర్తి లోని రంగనాయక స్వామి ఆలయంలో పెళ్లి జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వేడుకకు తమిళనాడు నుంచి పురోహితులు హాజరైనట్లు కూడా వార్తలు వినిపించాయి. అదేవిధంగా వీరి పెళ్లికి స్నేహితులు మరియు ఇరు కుటుంబాలు హాజరయ్యాయని సమాచారం. కానీ వీరిద్దరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు కానీ ఇతర డీటెయిల్స్ కానీ ఇప్పటివరకు బయటకు రాలేదు.

ఇక ఈ క్రమంలోనే తాజాగా సిద్ధార్థ్ మరియు అదితి నేడు తమ ఇంస్టాగ్రామ్ ద్వారా పెళ్లి పై క్లారిటీ ఇచ్చారు. అతను ఓకే చెప్పడంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాము అని అదితి రాసుకొచ్చింది. అంతేకాకుండా రింగ్ పెట్టుకున్న ఫోటోలను కూడా షేర్ చేశారు. దీంతో వీరిద్దరికీ ఇంకా పెళ్లి కాలేదని కేవలం నిశ్చితార్థం మాత్రమే అయ్యిందని ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.