స్క్రిప్ట్ కోసం ఏకంగా నాలుకనే తీసేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే విపరీతమైన ప్రేక్షకు ఆదరణ పొందగలుగుతున్నాయి. అలా ప్రేక్షక ఆదరణ పొందిన షోలలో జబర్దస్త్ కూడా ఒకటి. ఈ షోను చూస్తూ ఎంతోమంది తమ బాధలను మరియు ఇతర సమస్యలని మరిచిపోతున్నారు. ఇందులో కమెడియన్స్ పండించే కామెడీకి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు. మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఈ షోను బాగా ఆదరిస్తున్నారు.

ఇక ఈ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీస్ అయ్యారు కూడా. ఇక తాజాగా విడుదలైన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ షోలో స్క్రిప్ట్ కోసం ఓ కమెడియన్ నాలుకను కోసేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది నిజ జీవితంలో కాదు.. స్క్రిప్ట్ కోసం తన మాటలను త్యాగం చేశాడు. అసలు మేటర్ లోకి వెళితే.. కమెడియన్ సన్నీ, దొరబాబులతో పాటు ఆటో రాంప్రసాద్ ఓ స్క్రిప్ట్ చేశారు. ఈ క్రమంలో మాది మంచి పురం అండి. మా ఊర్లో అంతా మంచోళ్ళు అని రాంప్రసాద్ అంటాడు. అంతేకాకుండా అతను నా తమ్ముడు అని సన్నీని పరిచయం చేస్తాడు.

అనంతరం వాడు చాలా మంచివాడు అనగా.. దీంతో అక్కడే ఉన్న బాబు ఎందుకు అంత మంచివాడు అయ్యాడు అని అడుగుతాడు. ఇక రాంప్రసాద్ ఈ స్క్రిప్ట్ కోసం చాలా పెద్ద త్యాగం చేశాడని చెబుతాడు. దీనికి బాబు ఆ త్యాగం ఏంటో మాకు కూడా చెప్పవా అని అనడంతో.. సన్నీ స్క్రిప్ట్ కోసం తన నాలుక కోసేసుకున్నట్లు డైలాగ్స్ చెబుతాడు. దీంతో అక్కడున్న వారు అంతా షాక్ అవుతారు. దీంతో రాంప్రసాద్ ఇస్క్రిప్ట్ లో వీడికి మాటలు లేవని చెబుతాడు. అలా రియల్ లైఫ్ లో కాకపోయినా స్క్రిప్ట్ కోసం తన నాలుకను త్యాగం చేశాడు కమెడియన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.