పెళ్లయ్యాక ఫస్ట్ టైం భర్త పై అలాంటి కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.. షాక్ లో ఫ్యాన్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్ష‌కుల‌లో ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ సినిమాల కోసం ప్రయత్నాలు మొద‌లెట్టింది. అయితే అక్కడ కూడా ఆమె సక్సెస్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ జాకీ భ‌గ్నాన్నిని ప్రేమించి అతనిని వివాహం చేసుకుంది ర‌కుల్‌. కొద్దిరోజుల క్రితం వీరి వివాహం గోవాలో ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత మొట్టమొదటిసారి రకుల్ ప్రీత్ భర్త గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది.

జాకీ భ‌గ్నాన్ని గురించి మాట్లాడుతూ తనలో నచ్చే గుణగణాల గురించి అస్సాంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వివరించింది. జాకీ లాంటి వ్యక్తి నాకు భర్తగా లభించడం నిజంగా నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చిన ఆమె.. అతను ఎప్పుడు చాలా సరదాగా ఉంటాడు.. సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ.. అది నాకు బాగా నచ్చుతుంది. జాకీ ఎప్పుడు తను నవ్వుతూ చుట్టూ ఉన్న వారిని కూడా నవ్విస్తూ ఉంటాడు. అదే అతనిలో స్పెషల్ అంటూ వివరించింది. అదే జాకీని నేను ఇష్టపడేలా చేసింది అంటూ చెప్పుకొచ్చింది. మంచి మనసున్న వ్యక్తి జాకీ అంటూ చెప్పుకొచ్చింది.

ఇక కెరీర్ గురించి మా నాన్న ఇప్పటివరకు మమ్మల్ని అన్ని విషయాల్లోనూ ప్రోత్సహించారు. నేను సినిమాల్లో నటించగలనని నన్ను అమ్మ ఎంకరేజ్ చేసింది. వారి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా అంటూ ఆమె వివరించింది. టేబుల్ టెన్నిస్, గల్ఫ్‌, స్విమ్మింగ్ నాకు వాళ్ళు నేర్పించారని.. కష్టపడితే ఎవరైనా సక్సెస్ అవుతారని నన్ను ప్రోత్సహించే వారంటూ వివరించింది. తల్లిదండ్రులు సపోర్ట్ ఉండటం వల్ల నేను ఈ స్థాయికి చేరుకున్నానని.. ఎవరికైనా పేరెంట్ సపోర్ట్ ఉంటే అనుకున్నది సాధించి తీరుతారని చెప్పుకొచ్చింది. అయితే రకుల్ ప్రీత్, జాకీ భ‌గ్నాన్ని పై చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో ఈమె చాలా లక్కీ.. అందరూ అమ్మాయిలు ఇలాంటి వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు