బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వెంకటేష్, బాలయ్య లాంటి టాలీవుడ్ సీనియర్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తను నటించిన మల్లేశ్వరి సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక తరువాత బీ టౌన్‌కు మక్కాం మార్చేసి అక్కడ వరుస సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం బీటౌన్ సెన్సేషనల్ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. సినీ ఇండస్ట్రీలోనే ది పవర్ఫుల్ హీరోయిన్‌గా క్రేజ్ ను సంపాదించుకుంది.
ఇక 2003లో బూమ్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా సక్సెస్ సాధించకపోయిన తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. దీంతో బాలీవుడ్ లో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. 2005లో సల్మాన్ ఖాన్ సరసన నటించిన మైనే ప్యార్ తూనే కియాతో మంచి సక్సెస్ అందుకుని క్రేజీ బ్యూటీగా దూసుకుపోయింది. తర్వాత ఈమె కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. అయితే సినిమాలే కాకుండా మరోపక్క ఇండియన్ టాప్ బ్రాండ్స్ అన్నిటికీ అంబాసిడర్ గా కూడా వ్యవహరించేది. అలాగే బిజినెస్ రంగంలోనూ వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ఇక 2023లో పెప్సికోకు చెందిన మామిడికాయ జ్యూస్ స్లైస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది.
అయితే తర్వాత ఏవో కారణాలతో స్లైస్ ఎండాస్మెంట్ డీల్ కోల్పోవడంతో ఆమె ప్రయాణానికి ఎదురు దెబ్బ తగిలింది. లక్ష్మీ, ఎల్వి లోంరియల్ లాంటి ప్రతిష్టాత్మక బ్రాండ్లతో ఆమె క్రేజ్ సంపాదించుకున్నా.. స్లైస్ బ్రాండ్‌కు ఆమె ప్రధాన అంబాసిడర్ గానే ఉండేది. కానీ స్లైస్ నుంచి కత్రినా తప్పుకోవడంతో ఆమె స్థానంలో కియార క్రేజ్ సంపాదించుకుంది అని చెప్పాలి. స్లైస్ యాడ్ తో కియారాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ప్రకటనలో నయనతార నటిస్తుంది. ఇందులో ఆమె ఎంతో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అయితే కియారా అద్వానీ కత్రీనా ప్లేస్ లోకి రావడం.. కత్రినా ఈ డిల్ కోల్పోవడంతో ఆమెకు దాదాపు రూ.6 నుంచి 7 కోట్ల వరకు వచ్చే రెమ్యునరేషన్ కోల్పోయిందట. కానీ ఇప్పుడు స్లైస్ తో అనుబంధం కోల్పోవడంతో ఆమెకు ఆ డబ్బు నష్టం వచ్చినట్లయింది.