ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్.. రిజల్ట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

సినీ ఇండస్ట్రీలో చాలామంది నటినటులు స్టార్ హీరో, హీరోయిన్లుగా అవ్వడానికి అడుగుపెట్టి.. మెల్లమెల్లగా సినిమాల్లో నటిస్తూనే భారీ సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రిటీస్‌గా మారుతూ ఉంటారు. అయితే వారు ఆ స్టార్డం సంపాదించుకోవడానికి ఎంత శ్రమించాల్సి వస్తుంది. ఇలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత.. స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు రెబల్ స్టార్. ఈయన చేసిన సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ హీరోగా మారిపోయాడు.

Prabhas Remuneration for Salaar Ceasefire 1 | Prabhas Remuneration for  Salaar Ceasefire 1

కాగా బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సలార్ మాత్రమే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ప్రభాస్ నుంచి చివరగా వచ్చిన ఈ సినిమా రూ.800 కోట్ల భారీ గ్రాస్ వసూళ‌ను కొల్లగొట్టి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం వరుస‌ సినిమాలతో హిట్లు అందుకొని తన స్టార్‌డంను రెట్టింపు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు రెబల్ స్టార్. ఇదిలా ఉంటే చాలామంది స్టార్ హీరోస్ వద్దకు కొన్ని కథలు రావ‌డం.. ఏవో కారణాలతో వాటిని రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది.

Confirmed: Bobby and Rajinikanth to team up for a bi-lingual film | Telugu  Movie News - Times of India

అలా రజనీకాంత్ నటించిన ఓ సినిమాలో మొదట ప్రభాస్ కు ఛాన్స్ వచ్చిందట‌. అయితే ఆయన ఆ మూవీ రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం రజనీకి వెళ్లిందంటూ వార్తలు వినిపించాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. దాని రిజల్ట్ ఏంటో తెలుసుకుందాం. తమిళ్ స్టార్ డైరెక్టర్ కె. ఎస్. రవికృష్ణ డైరెక్షన్‌లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లింగా సినిమా.. మొదట ప్రభాస్ తో తీయాలని భావించారట మేకర్స్. కానీ లింగా సినిమా స్టోరీ ప్రభాస్‌కు నచ్చకపోవడంతో అయనా ఈ సినిమా రిజెక్ట్ చేశాడు.

Lingaa (2014), 46% OFF | pishnahad.ir

దాంతో ఈ సినిమా రజినీకాంత్ వద్దకు వెళ్ళింది. రజినీకాంత్ సినిమాకు ఒప్పుకొని నటించాడు. అయితే అప్పట్లో ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. కాగా తెలుగు, తమిళ్ రెండు భాషల్లో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ప్రభాస్ నిజంగా ఈ సినిమాను చాలా తెలివిగా తప్పించుకున్నాడు అంటూ కొంతమంది త‌మ అభిప్ర‌యాని షేర్ చేసుకున్నారు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ఇలాంటి డిజాస్టర్ కథను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తప్పు చేశారంటూ.. అనవసరంగా ఇరుక్కుపోయారంటూ.. లేదంటే ఓ డిజాస్ట‌ర్‌ నుంచి ఆయన సేవ అయ్యేవాడు అంటూ ర‌జినీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.