“రాజమౌళి దేవుడిని నమ్మడు.. కానీ పూజలు చేస్తాడు”.. ఎందుకో తెలుసా..?

రాజమౌళి .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేసిన ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి . అభిమానులు ముద్దుగా జక్కన్న అంటారు . అభిమానుల నాడి పట్టుకుని సినిమాను తెరకెక్కించడంలో జక్కన్న తర్వాతనే మిగతా ఏ డైరెక్టర్ అయినా అని చెప్పడంలో సందేహం లేదు .

రీసెంట్గా రాజమౌళికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కర్ణాటకలోని బళ్లారిలో అమృతేశ్వర్ ఆలయ ప్రారంభోత్సవానికి రాజమౌళి హాజరయ్యారు . నిజానికి రాజమౌళి దేవుడి ని నమ్మడు.. కానీ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు . దీని పట్ల ఫ్యాన్స్ రకరకాల ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు . సినిమా పూజా కార్యక్రమాలలో దేవుడికి కొబ్బరికాయ కొడతావు.. దండం పెట్టుకుంటారు.. కానీ దేవుడిని నమ్మవు ఏంటిది ..? అంటూ ప్రశ్నిస్తున్నారు .

అయితే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి లీకైన సమాచారం ప్రకారం ఆయన లైఫ్ లో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడట . ఆ టైంలో దేవుడు కూడా ఆయనకు హెల్ప్ చేయలేదు అని ..ఆయన గట్టిగా నమ్మారట. తన టాలెంట్ తన కష్టమే ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని ..అందుకే దేవుడిని నమ్మాలి కాని దేవుడిపై పూర్తి భారం వేయకూడదు అని రాజమౌళి అందరికీ చెప్పుకొస్తూ ఉంటారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!