రచ్చ మూవీ షూటింగ్ లో అంత రచ్చ జరిగిందా.. ? తమన్నా, చరణ్ మాట్లాడుకోకపోవడానికి కారణం అదేనా..?!

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక చివ‌రిగా చెర్రీ సోలొగా న‌టించిన‌ ఆర్ఆర్ఆర్‌తో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. మొదట పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన చిరుత సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా నుంచి వరుస సక్సెస్‌లు సాధిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఇక వరుస‌ సక్సెస్‌లు వస్తున్న సమయంలోనే సంపత్‌ నంది డైరెక్షన్లో ఆరెంజ్‌ సినిమాలో నటించాడు. ఈ సినిమా ప్లాప్ అయినా రామ్ చరణ్ సంపత్ నందికి మరో ఛాన్స్ ఇచ్చాడు.

Vaana Vaana Full Video Song || Racha Movie || Ram Charan Teja, Tamanna

రచ్చ సినిమాతో వీరిద్దరి కాంబో మళ్లీ రిపీట్ అయింది. ఇక ఈ మూవీలో హీరోయిన్గా తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ఇక‌ ఈ సినిమా షూటింగ్ టైంలో రామ్ చరణ్ కు తమన్నా కు మధ్య చాలా డామినేష‌న్ ఉండేదని.. అందుకే వీరిద్దరూ ఈ సినిమా టైంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అసలు విషయం ఏంటంటే.. రచ్చ సినిమా షూటింగ్ టైంలో రామ్ చరణ్ ను తమన్నా చాలా విషయాల్లో డామినేట్ చేసేదట. ముఖ్యంగా సాంగ్ షూట్ చేసేటప్పుడు రిహార్సల్స్ రామ్ చరణ్ తో పాటు చేయకుండా తను ఒక్కటే సపరేట్గా చేస్తూ ఉండేదట. రామ్ చరణ్ వాటిని పట్టించుకోవడం మానేసి తన డ్యాన్స్ తాను చేస్తూ ఉండేవాడట.

Ram Charan Tamannaah, actor, actress, bollywood, ram charan, ramcharan,  tamanna, HD wallpaper | Peakpx

అయితే ఒక రోజు షూటింగ్ మొత్తం రామ్ చరణ్‌తో కలిసి చాలా బాగా మాట్లాడుతూ.. షూటింగ్ రిహార్సల్స్ కూడా కలిసి చేసిందట. ముందు రోజు వరకు ఎందుకు తమన్నా అలా ప్రవర్తించిందో అప్పటి వరకు ఎవరికీ తెలియదట.. దానికి కారణం రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకు కావడమే.. అలాంటి పెద్ద స్టార్ హీరోల కొడుకు అంటే ఎవరికైనా కాస్త భయం ఉంటుంది.. కనుక ముందు నుంచే రామ్‌చరణ్‌తో దూరంగా ఉంటూ వచ్చిందట. అయితే అది తెలియని చాలామంది రామ్‌చరణ్‌ను డామినేట్ చేస్తున్నట్లుగా కనిపించేసరికి.. అది అందరి నోటా ఆమెకు చేరడంతో.. నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు.. అని మళ్ళీ రామ్‌చరణ్ తో కలిసి మాట్లాడి.. అతనితో చనువుగా ఉంటూ సినిమాను పూర్తి చేసిందట. ఇక దీంతో రామ్‌చరణ్‌కు ఆమె మంచి ఫ్రెండ్ అయిపోయింది.