మరోసారి ఐటెం సాంగ్ లో చిందులు వేయబోతున్న పూర్ణ.. ఈసారి ఏకంగా పాన్ ఇండియా స్టార్ట్ తోనే..!

పూర్ణ .. ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి ఆ తర్వాత ఐటెం సాంగ్స్ చేస్తూ పరు సీనియర్ పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ . సీమటపాకాయ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది పూర్ణ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది . అవును సిరీస్ ఆమెకు ఎంత పెద్ద హిట్ ఇచ్చాయో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పూర్ణ పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె బాడీ ఫిజిక్ లో మార్పులు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఆమెకు హీరోయిన్గా అవకాశాలు కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అవకాశాలు వస్తూ వచ్చాయి. రీసెంట్గా గుంటూరు కారం సినిమాలో స్పెషల్ సాంగ్లో మెరిసింది పూర్ణ . ఈ సాంగ్లో గ్రేస్ తో.. స్టెప్స్ వేసి అభిమానులను ఆకట్టుకుంది. స్టార్ డైరెక్టర్ సైతం పూర్ణ లోని గ్రేస్ కు ఫిదా అయిపోయారు . ఈ క్రమంలోనే ఆమెకు మరో స్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం లభించింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఆయన మరెవరో కాదు ప్రభాస్. ప్రభాస్ ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ముందుకు దూసుకెళ్తున్నాడు . ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “ది రాజా సాబ్”. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ యాంగిల్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో హీరోయిన్గా ముగ్గురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నారట. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో పూర్ణ చిందులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండింగ్గా మారింది..!!