పవన్, కే. విశ్వనాధ్ కాంబోలో సినిమా మిస్ అయింది అని తెలుసా.. కారణం ఇదే..?!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. సినిమాల్లో తన నటన‌తో స‌త్తా చాటుకున్న పవన్.. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ రోజు.. ఫస్ట్ షో థియేటర్స్‌లో రిలీజ్ అవుతుందంటే చాలు.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చేసే హడావిడి ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ స్టార్టింగ్ లో వరుస‌ సినిమాల్లో నటిస్తూ సూపర్ సక్సెస్ అందుకుంటూ స్టార్ హీరోగా మారాడు. ఈ క్రమంలో ఎంతమంది డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ నటించినా.. డైరెక్టర్ కె.విశ్వనాథ్ డైరెక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాలని భావించారట.

కానీ అనుకోని కారణాలతో ఆ సినిమా సెట్స్‌ పైకి రాకముందే చెక్ ప‌డింది. ఇవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి.. సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత గోకులంలో సీత, స్వాగతం లాంటి సినిమాల్లో నటించాడు. ఇక ఆ సినిమాల తరువాత విశ్వనాథ్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలని భావించారట. అది ఆర్ట్ మూవీ స్టోరీ కావడంతో.. పవన్ కళ్యాణ్ కూడా ఆ సినిమాను చేయడానికి ఆసక్తి చూపాడు.

కానీ ఏవో కారణాలతో ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు. అలా వీరిద్దరూ సినిమా తీయాలని కాంబో ఫిక్స్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు స్టొరీ కూడా బాగా నచ్చేసినప్పటికీ.. సినిమా చివరి నిమిషంలో మిస్ అయిపోయింది. ఇక గత సంవత్సరం కె.విశ్వనాధ అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబోలోసిన సినిమా ఇకపై వచ్చే అవకాశం కూడా లేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఓ పక్కన రాజకీయాల్లో రాణిస్తూనే.. మరో పక్కన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాల షూటింగ్‌లో బిజీగా గడుతున్నాడు.