సుకుమార్ ప్రొడ్యూసర్ గా నాగచైతన్య కొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?!

అక్కినేని నట వారసుడు నాగచైతన్య ప్రస్తుతం తాండేల్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చైతు కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్‌ ఇండియా సినిమాగా తరికెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. అయితే ఇంకా ఈ సినిమా రిలీజ్ కాకముందే.. నాగచైతన్య మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఓ మిస్టికాల్ థ్రిల్లర్ సినిమాకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సుకుమార్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడట. ఇంతకీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరు..? ఆ విషయాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

విరుపాక్ష ఫేమ్‌ కార్తీక్ దండు డైరెక్షన్‌లో నాగచైతన్య మిస్టికాల్ థ్రిల్లర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక కార్తీక్ దండు డైరెక్షన్‌లో గతంలో వచ్చిన విరూపాక్ష ఎలాంటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజైన ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే తర్వాత కార్తీక్ దండు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ తాజాగా నాగచైతన్యాతో మరొక మిస్టికల్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. దీనికోసం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.

విరూపాక్షతో కార్తీక్ దండు క్రేజ్ చాగా పెరిగిందనడంలో సందేహం లేదు. ఆయనతో సినిమా అంటే దాదాపు అందరూ హీరోలు ఓకే చేసే రేంజ్ లో తన సత్తా చాటాడు కార్తీక్. ఇక దీంతో తన నెక్స్ట్ మూవీకి అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట‌. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్ జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ మూవీకి సుకుమార్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారట. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో నడిచే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. ఇక ఇటీవల థ్రిల్లర్ సిరీస్ దూతతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు చైతు. ఇలాంటి క్రమంలో మరో థ్రిల్లర్ సినిమా చైతు నుంచి వస్తుందని తెలియడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.