రాజమౌళి కే తడిసిపోయే షాక్ ఇవ్వబోతున్న మహేశ్.. చరణ్-తారక్ కూడా చేయలేని పని..!

మనకు తెలిసిందే ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్ ఉంది . రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఏ హీరో అయిన ఆ తరువాత పక్క డైరెక్షన్ లో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని . ఇప్పటివరకు చరిత్ర చెబుతున్న గుణపాఠం కూడా అదే . ఇప్పటివరకు రాజమౌళి డైరెక్షన్ లో నటించిన ప్రతి హీరో కూడా ఆ బ్యాడ్ సెంటిమెంట్ కి బలైపోయారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – రవితేజ – తారక్ లాంటి స్టార్ హీరోలు కూడా బ్యాడ్ సెంటిమెంట్ కి బలైన విషయం మనకు తెలిసిందే .

అయితే అలాంటి బ్యాడ్ సెంటిమెంట్ నుంచి తప్పించుకోవడానికి మహేష్ బాబు క్రేజీ ప్లాన్ వేశారట. రాజమౌళి దర్శకత్వం తర్వాత వేరే డైరెక్షన్లో నటిస్తే కచ్చితంగా ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది కదా అదేదో ఫ్లాప్ డైరెక్టర్ పని అయిపోతుందిగా అంటూ డిసైడ్ అయ్యారట. అంతేకాదు ఎప్పటినుంచో మెహర్ రమేష్ మహేశ్ తో సినిమాను తెరకెక్కించాలని ఆశపడుతున్నారు. పైగా మెహర్ రమేష్ – మహేష్ బాబు మంచి ఫ్రెండ్స్ .

అందుకే ఆయనకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట . అయితే ఈ నిర్ణయం పట్ల మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు . ఫ్లాపు పడుతుందో లేదో తెలియదు .. పడుతుందన్న భయంతో ఇలాంటి నిర్ణయమా..? అది కూడా మెహర్ రమేష్ కి అవకాశమా..? వామ్మో మరో భోళా శంకర్ తెరకెక్కిస్తాడేమో అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. చూడాలి మరి మహేష్ బాబు ఫ్యాన్స్ సజెషన్ ఫాలో అయ్యి డేరింగ్ డెసిషన్ తీసుకుంటారా..? రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ పై నమ్మకంతో మెహర్ రమేష్ కి అవకాశం ఇస్తారా..? మరి కొద్ది రోజుల్లో తెలిసిపోబోతుంది..!!