ఆ మూవీ షూట్ లో నిజంగానే పాము కాటు.. చాలా భయపడ్డా.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

నాగదేవత ఇతివృత్తాలతో ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. దాదాపు తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్ లో పాము వినియోగించిన.. కొన్ని సీన్లలో మాత్రం అసలు పామును వాడుతూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ జరుపుకుంటారు. అయితే ఓ సినిమా షూటింగ్ టైంలో పాము నిజంగానే కాటు వేసిందని.. ఆ పాము కాటుతో ఒకరు మరణించారని.. వార్త నెటింట‌ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ విషయాన్ని ఎవరు చెప్పారు అనుకుంటున్నారా.. స్వయంగా ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఈ విషయాన్ని వివరించారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. ఇంతకీ ఆ సినిమా షూటింగ్ ఏంటి.. ఏ హీరోయిన్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం. తెలుగు సినిమాల్లో నాగపాము ఇతివ్రతంతో తెర‌కెక్కిన సినిమాల్లో దేవి కూడా ఒకటి. ఈ సినిమా రిలీజై తాజాగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కోడి రామకృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాల్లో ప్రేమ హీరోయిన్గా నటించింది.

వనిత, షిజు, అబూ సలీం, భానుచందర్ తదితరులు కీలకపాత్రలో మెప్పించారు. సోషియా ఫాంట‌సీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 12 మార్చి 1999న రిలీజై మంచి సక్సెస్ సాధించింది. సినిమా పూర్తై పాతికేళ్లు కావడంతో.. హీరోయిన్ ప్రేమ దేవి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ టైంలో తనకు ఉన్న అనుభవాలను, సంఘటనలను వివరించింది. షూట్ లో పాము ఒకరి ప్రాణం తీసింది అంటూ గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. సినిమా కోసం స్టాఫ్ అంతా రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తామని.. సినిమాలో ఉన్నట్లు నిజంగా షూట్ టైంలో ఓ వ్యక్తికి పాము కాటేసిందని వివరించింది. ఆ వ్యక్తిని కాపాడేందుకు అందరం ఎంతో ప్రయత్నించామ‌ని.. ఆసుపత్రికి తీసుకువెళ్లినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని అతను చనిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

దీంతో షూటింగ్ రెండు రోజులు వాయిదా పడిందని వివరించింది. ఇలా ఎన్నో కష్టాలు పడి సినిమా తెర‌కెక్కించిన తర్వాత రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే చివరకు సినిమా సూపర్ హిట్ కావడంతో మా కష్టాలన్నీ మర్చిపోయామని వివరించింది. ఇక ప్రేమ ఈ సినిమా గురించి మాట్లాడుతూ నా కెరీర్‌లోనే ఈ సినిమా ఎంతో ప్రత్యేకం. మర్చిపోలేని అద్భుతమైన జ్ఞాపకం అంటూ వివరించింది. ఇక 2006లో ఓ ప్ర‌ముఖ ఇండస్ట్రీయ‌లిస్ట్‌ను వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇక 2016లో అతనితో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. తెలంగాణ నేపథ్యంలో వస్తున్న రజాకర్ సినిమాలో ప్రేమ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. మంచి కథలు వస్తే సినిమాలో నటించేందుకు ఆమె ప్రయత్నిస్తుంది.