అవన్నీ అమ్మ నుంచే నాకు వచ్చాయి.. నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణం అదే.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..

అక్కినేని నట వారసుడుగా మూడోతరం హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నాగచైతన్య. నాగార్జున తనయుడు గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చైతు పలు సినిమాల్లో హీరోగా నటించి సక్సెస్ సాధించాడు. అయినా ఊహించిన రేంజ్ లో స్టార్డం అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం చైతు తండేల్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది చైతు కెరీర్‌లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాల్లో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్న నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశారు.

ఆ ఇంటర్వ్యూలో చైతు మాట్లాడుతూ వాళ్ళ అమ్మ గురించి, రామానాయుడు, ఏఎన్నార్ల గురించి షాకింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. చైతు మాట్లాడుతూ రామానాయుడు, ఏఎన్ఆర్ గార్ల‌ నుంచి నేను టైం డిస్ప్లేను చాలా నేర్చుకున్నా. ఒక మనిషి ఏదైనా టైం చెప్తే కచ్చితంగా ఆ టైం ఫాలో అవ్వాలి. అది ఎంత చిన్న వారైనా వారి టైంకు కూడా మనం విలువ ఇవ్వాలి అనే విషయాన్ని వారి నుంచి నేర్చుకున్న. వారిద్దరు ఎప్పుడు డౌన్‌టూ ఎర్త్ పర్సన్స్‌లానే ఉన్నారు. ఇక నా చిన్నతనం అంతా అమ్మ దగ్గరే జరిగింది. 18 సంవత్సరాలు వచ్చేవరకు అమ్మ నన్ను పెంచింది. ఇక అమ్మ విషయానికి వస్తే చాలా స్ట్రిక్ట్.. ఎథిక్స్ ఫాలో అవుతూ నన్ను క్రమశిక్షణగా పెంచింది.

టైం సెన్స్ గురించి.. ఒక పర్సన్‌కు రెస్పెక్ట్ ఇచ్చే విష‌యంలో అమ్మ చాలా స్ట్రిక్ట్. ఇలాంటివన్నీ అమ్మే నాకు నేర్పింది అందుకే నేను ఈ స్టేజ్‌లో ఉన్న అని నేను న‌మ్ముతా అంటూ చైతూ వివ‌రించాడు. ఆయ‌న మాట్లాడుతూ.. ఓ విధంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు సిగ్గు ఎక్కువ.. బాగా కంఫర్ట్ ఉన్న వాళ్లతోనే ఓపెన్ గా మాట్లాడతా.. అందుకే నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు.. వద్దు కూడా.. నలుగురు ఐదుగురు ఉంటే చాలు.. అది కూడా నిజాయితీగా ఉండేవాళ్ళు.. నేను తప్పు చేస్తే నాకు చెప్పేవాళై ఉండాలి. అదృష్టవశాత్తు అలాంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. అది చాలు అంటూ వివరించాడు నాగచైతన్య.