వారానికి మద్యం ఎంత సేవించవచ్చు?.. అతిగా తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..!

మద్యం ఆరోగ్యానికి హానికరం అని టీవీలో కూడా యాడ్స్ వేస్తూ ఉంటారు.ఇక దీనిని తాగటం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యూత్ నుండి పెద్దవారి వరకు చాలా మంది విపరీతంగా మందు తాగుతున్నారు. ఏ చిన్న పార్టీ లేదా ఫంక్షన్ జరిగిన సరే తప్పకుండా అక్కడ మద్యం ఉండాల్సిందే.

ఇక కొంతమంది ప్రతి రోజు ఆల్కహాల్ తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అది వారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తదని ఆలోచించరు. మద్యం సేవించటం కొంతవరకు బెటరే కానీ,అది అతిగా తాగితే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు.ఈ మధ్యకాలంలో చాలామంది అనేక వ్యాధులు బారిన పడుతున్నారు.ముఖ్యంగా ఆల్కహాల్ అతిగా తీసుకునే వారు లివర్ సంబంధిత వ్యాధులు , గుండె సంబంధ వ్యాధులతో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

అందువలన వైద్యులు చాలా తక్కువ లిమిట్ తో మద్యం సేమించాలని చెబుతున్నారు.పెద్దలు వారానికి 10 కంటే ఎక్కువ పెగ్గులు,రోజుకు నాలుగు కంటే ఎక్కువ పెగ్గులు తీసుకోకూడదటున్నారు నిపుణులు. అదే వైన్ విషయానికొస్తే ..150 ML ని ఒక పెగ్గు అంటారు. ఈ లెక్కన విస్కీ, రమ్, జీన్ వంటి వాటిని వారానికి 300 ML కంటే ఎక్కువగా తీసుకోకూడదు.ఇక బీర్ విషయానికొస్తే..మందు బాబులు బీర్ ను బాటిళ్లను లాగిస్తారు. కానీ బీర్ను వారానికి ఆరు పెద్ద బాటిళ్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు.