దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరో తెలుసా..? నందమూరి ఫ్యాన్స్ ఊహించని సర్ ప్రైజ్ ఇది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న కొరటాల శివ.. ప్రజెంట్ ఎంతో భయంగా.. ప్రతిష్టాత్మకంగా .. ఇష్టంగా తెరకెక్కిస్తున్న సినిమా దేవర . ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఆచార్య లాంటి బిగ్ డిజాస్టర్ తర్వాత కొరటాలకు మళ్లీ కొత్త లైఫ్ ఇవ్వబోతుంది ఈ సినిమా అంటూ జనాలు బాగా ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు .

అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది అంటూ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది . అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్గా లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే దేవర పార్ట్ 2 మమిత బైజు కనిపించబోతుందట . జాన్వి కపూర్ దేవర వన్ లోనే చనిపోబోతుందట.

ఆ తర్వాత ఆమె ప్లేస్ లోకి మమిత బైజు రాబోతుందట. కొరటాల స్క్రిప్ట్ చాలా బాగా రాసుకున్నాడు అంటున్నారు నందమూరి అభిమానులు . దేవర సినిమాలో ఇద్దరూ టాప్ హీరోయిన్స్ ఉండడం ఇప్పుడు అభిమానులకి సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. నిజానికి దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది . కొన్ని అనివార్య కారణాల చేత అక్టోబర్ 10 కి వాయిదా పడింది . ఈ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు . సినిమా మ్యూజిక్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అంటూ మేకర్స్ దగ్గర నుంచి క్రేజీ క్రేజీ కామెంట్స్ వినిపిస్తున్నాయి..!!