విజయ్ దేవరకొండ ఆ హీరోయిన్ ని నమ్మించి చీట్ చేశాడా..? అందుకే అలా బీహేవ్ చేస్తున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ .. ప్రజెంట్ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని డైరెక్టర్ పరశురాం తెరకెక్కిస్తున్నాడు . గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన గీతా గోవిందం సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా ఆ సినిమాని బీట్ చేసే విధంగా ఉండబోతుంది అని రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ ఆధారంగా తెలుస్తుంది .

ఇలాంటి మూమెంట్లోనే విజయ్ దేవరకొండ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . విజయ్ దేవరకొండ హీరోయిన్ పూజ హెగ్డే ను చీట్ చేశాడు అని నమ్మించి మోసం చేశాడు అని పలువురు జనాలు మండిపడుతున్నారు . జనగణమన సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డేను ఏరి కోరి పెట్టుకున్న ఆయన ఆ సినిమా ఆగిపోయిన తర్వాత ఆమెకు మళ్ళీ అవకాశం ఇచ్చాడట .

గౌతమ్ తిన్నురి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ఆమెనే హీరోయిన్గా అనుకున్నారట . కానీ కొన్ని కారణాల చేత మళ్లీ ఆమెను తీసేసి వేరే బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నారట. అంతేకాదు ఎక్కడ ఆమె ఈ విషయంపై ఆయన నిందిస్తుందో అన్న భయంతో ఆమె నెంబర్ కూడా బ్లాక్ చేసేసాడట. ఇది నిజంగా దారుణం అంటున్నారు పూజ అభిమానులు . విజయ్ దేవరకొండ ఇలా చేస్తాడా అంటూ ఫైర్ అవుతున్నారు . అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉన్నది అన్నది ఎవరికీ తెలియదు . సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా వైరల్ అవుతుంది..!!