వాళ్ల నోర్లు మూయించడానికి విజయ్ దేవరకొండ అలా చేశాడా..? బాధపడకండి రా ఫ్యాన్స్..!

జనరల్ గా విజయ్ దేవరకొండ అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది రౌడీ హీరో .. అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ .. తల పొగరు.. ఇలాంటి పదాలే వాడుతూ ఉంటారు. పెళ్లిచూపులు సినిమాతో క్లాసిక్ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ .. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరోలు సైతం విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ కి షాక్ అయిపోయారు.

 

రీసెంట్గా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటించాడు . ఈ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. అయితే టీజర్ అంతా బాగున్నప్పటికీ ఎక్కడా కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే హై లెవెల్ రొమాన్స్ కి సంబంధించి సీన్స్ ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేకపోవడం గమనార్హం . దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డీలాగా కామెంట్స్ పెడుతున్నారు .

అయితే కొందరు విజయ్ దేవరకొండ అంటే ఓన్లీ రొమాన్స్ అనుకుంటున్నాడు అని..చాలా మంది అలా ఆయనను ట్రోల్ చేశారని.. క్లాసిక్ హిట్లు కూడా కొట్టగలడు అని ప్రూవ్ చేయడానికి విజయ్ దేవరకొండ ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి టీజర్ చూస్తుంటే విజయ్ దేవర కొండ భారీ హిట్ కొట్టే లానే ఉన్నాడు..!!