నందమూరి ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ కంటే ముందే మరో హీరో ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..?!

నందమూరి నట వారసులుగా ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వారిలో ప్రస్తుతం బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు మాత్రమే కొనసాగుతూ.. తమ న‌ట‌న‌తో సత్తా చాటుతున్నారు. ఎవరికి వారు ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. కాగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తాడంటూ నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ మాత్రం ఇప్పటివరకు సినీ ఎంట్రీ ఇవ్వలేదు.

ఈ క్రమంలో మోక్షజ్ఞ కంటే మందే నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అతను ఎవరు.. ఆ సినిమా డీటెయిల్స్ ఏంటో.. ఒకసారి చూద్దాం. ఆ హీరో ఎవరో కాదు హరికృష్ణ పెద్ద మనవడు. హరికృష్ణకు ముగ్గురు కొడుకులు.. వారిలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు. అయితే పెద్ద కొడుకు జానకిరామ్ మొదట్లో నిర్మాణ రంగానికి పరిమితం అయ్యాడు. 2014లో రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు జానకిరామ్ పెద్ద కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అతనిని హీరో చేసే బాధ్యత డైరెక్టర్ వై.వి.ఎస్ చౌదరి తీసుకున్నాడట. నందమూరి కుటుంబంతో దర్శకుడు వై.వి.ఎస్. చౌదరికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయనకు హరికృష్ణతో మంచి బాండింగ్ ఉంది. గతంలో వీరిద్దరి కాంబోలో సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు తెరకెక్కాయి. ప్రేక్షకులు ఈ సినిమాలను అదేవిధంగా ఆదరించారు. అయితే తర్వాత కాలంలో వరుసపరాజయాలు ఎదురు కావడంతో వై.వి.ఎస్ చౌదరి మెగా ఫోన్ పట్టలేదు.

ఇక హరికృష్ణ కూడా 2018లో రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే హరికృష్ణ లేనప్పటికీ ఆయనపై ఉన్న అభిమానంతో జానకిరామ్ పెద్ద కొడుకుని హీరోగా పరిచయం చేసే బాధ్యతను డైరెక్టర్ వై.వి.ఎస్. చౌదరి తీసుకున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ మనవడు ఒక మంచి లవ్ స్టోరీ తో ఎంట్రీ ఇవ్వనున్నాడని టాక్. ఇక 2006లో రామ్ పోతినేని హీరోగా పరిచయం చేస్తూ వై.వి.ఎస్ చౌదరి తీసిన‌ మూవీ దేవదాస్.. ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఈయన మళ్ళీ అలాంటి లవ్ స్టోరీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.