కొడుకు కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సుమ.. సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లేటెస్ట్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు.. సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. బుల్లితెరపై యాంకర్ సుమకు ఎలాంటి క్రేజీ పాపులారిటీ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ ఉంటుంది . కాగా రీసెంట్గా సుమ కొడుకు రోషన్ కనకాల కూడా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయన బబుల్గం అనే సినిమాలో నటించాడు . ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.

కానీ యువతను బాగానే ఎంటర్టైన్ చేసింది . నేటి జనరేషన్ ఇష్టపడే ముద్దులు – హగ్గులు రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలో బాగానే పుష్కలంగా ఉన్నాయి . కానీ ఈ సినిమా హిట్ కాలేదు. అయితే కొడుకు సెకండ్ సినిమా విషయంలో మాత్రం యాంకర్ సుమ చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉందట . అంతేకాదు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి అయినా సరే మంచి హీరోయిన్ ని ఫిక్స్ చేయాలి అంటూ డిసైడ్ అయిందట .

అందుతున్న సమాచారం ప్రకారం సుమ – వైష్ణవి చైతన్యను తన కొడుకుతో నటించమంటూ రిక్వెస్ట్ చేస్తుందట . ఇప్పటికే రోషన్ కనకాల తన సెకండ్ సినిమాకి సంబంధించి సైన్ కూడా చేశాడు అని వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ఆల్మోస్ట్ హీరోయిన్గా ఫిక్స్ అయింది అని సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అడిగి అడిగి బ్రతిమలాడి.. వైష్ణవి చైతన్యను ఈ ప్రాజెక్టుకు ఒప్పించిందట సుమ. దీంతో ఆమె అభిమానులు మండిపడుతున్నారు. కొడుకు కోసం నీ రేంజ్ తగ్గించుకుంటావా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు..!!