అందమైన జుట్టుని పొందాలనుకుంటున్నారా.. అయితే తమలపాకుని ఇలా వాడండి..!

సాధారణంగా తమలపాకులని ఏదైనా వేడుక లేదా పాన్ వంటి వాటికి వాడుతూ ఉంటారు. అదేవిధంగా ముత్తయిదులను ఇంటికి పిలిచిన తమలపాకులపై అరటి పళ్ళు పెట్టి ఇస్తూ ఉంటారు. తమలపాకులు ఫార్మాలిటీనే కాదు ఎంతో ఆరోగ్య కరం కూడా.

తమలపాకులో ఉండే గుణాలు మన శరీరానికి ఎంతో మంచిది. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి తమలపాకులు. అలాగే తమలపాకులలోని యాంటీ ఆక్సిడెంట్స్, మరియు ఫైబర్ వంటి గుణాలు మన ఆరోగ్యానికే కాకుండా జుట్టుకి కూడా ఎంతో మంచిది. జుట్టు పొడిబారి పోయినప్పుడు ఈ తమలపాకులతో నివారించుకోవచ్చు.

తమలపాకులని పేస్ట్ కింద చేసి ఒక పది నిమిషాల పాటు ఫ్రిజ్లో ఉంచి అనంతరం మీ జుట్టుకి అప్లై చేయడం ద్వారా పొడవైన జుట్టుతో పాటు అందమైన ఆరోగ్యం మీ సొంతం చేసుకోవచ్చు. ఇలా కనీసం వారానికి రెండు మూడు సార్లు చేయడం ద్వారా పొడవైన జుట్టు పొందవచ్చు మరియు ఆరోగ్యం కూడా పొందవచ్చు. అందువల్ల ప్రతిరోజు కాకపోయినా వారానికి రెండు రోజులు తప్పనిసరిగా తమలపాకు పేస్ట్ ని మీ జుట్టుకి అప్లై చేయండి.