సౌత్ ఇండస్ట్రీలో తమ కో స్టార్స్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు లిస్ట్ ఇదే..

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్న చాలామంది తమ కోస్టార్స్ తో ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకున్నారు. వారిలో కొంతమంది ఇప్పటికీ ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తుంటే.. మరి కొంత మంది మాత్రం ఏవో కారణాలతో విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అలా చాలామంది హీరో, హీరోయిన్లు తమ కోస్టార్స్ తోనే ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి సౌత్ ఇండస్ట్రీలో అలా తమ కోస్టార్స్ ని ప్రేమించి వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరు ఓసారి చూద్దాం.

నాగార్జున – అమల:


టాలీవుడ్ కింగ్‌.. అక్కినేని మన్మధుడు నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు తన కోస్టార్ అయిన అమలను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కాగా నాగార్జునది ఇది రెండో వివాహం. వీరిద్దరూ రెండు సినిమాల్లో కలిసి నటించారు. ఈ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్:


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్ర‌త‌తో కలిసి వంశీ సినిమాలో నటించాడు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమలు పడడం.. అనంతరం పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ వారు తమ వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే ఎన్నో జంటలకు ఆదర్శంగా నిలిచారు.

ప్రసన్నకుమార్ – స్నేహ:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ట్రెడిషనల్ బ్యూటీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో స్నేహ ఒకటి. అలాగే కోలీవుడ్ నటుడు ప్రసన్నకుమార్ కూడా తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతున్నాడు. స్నేహ – ప్రసన్నకుమార్ కోలీవుడ్లో పలు సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడడం.. పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకోవడం జరిగింది.

సూర్య – జ్యోతిక:


స్టార్‌ హీరో సూర్య సినీనటి జ్యోతిక ఈ జంటకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. కాగా సూర్య – జ్యోతిక ఫ్యామిలీకి తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం సూర్య తండ్రి వీరి ప్రేమ పెళ్లిని అంగీకరించడంతో మరోసారి కుటుంబ సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది.

అజిత్ – శాలిని:


తెలుగులోను పలు సినిమాలు నటించి తనకంటూ పాపులారిటీ దక్కించుకున్న.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. ఇప్పటికీ అదే క్రేజ్‌తో కొన‌సాగుతున్నాడు. వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇక ఈయన తన కో స్టార్ శాలినితో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత శాలిని ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది.

య‌ష్ – రాధిక పండిత్:


కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారి దక్కించుకున్న వారిలో యష్ ఒక‌రు. కేజీఎఫ్ సిరీస్ లతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు య‌ష్‌. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్.. తన కోస్టర్ రాధిక పండిట్ ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్లి తర్వాత రాధిక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.